Manipur | మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస… 9 మంది మృతి
మణిపూర్: మంగళవారం అర్ధరాత్రి నుంచి మణిపూర్ (Manipur) లోని ఖమెన్‌లోక్ ప్రాంతంలో అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో ఒక మహిళ సహా 9 మంది మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కంగ్సోపీ, ఈస్ట్ ఇంఫాల్ జిలల్లా సరిహద్దుల్లో సైతం కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ ప్రజలపై సాయుధులు కాల్పులకు తెగబడుతున్నారని స్థానిక అధికారులు బుధవారం వెల్లడించారు. శాంతి స్థాపక కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను చేర్చడంపైనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు […]

మణిపూర్: మంగళవారం అర్ధరాత్రి నుంచి మణిపూర్ (Manipur) లోని ఖమెన్‌లోక్ ప్రాంతంలో అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో ఒక మహిళ సహా 9 మంది మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కంగ్సోపీ, ఈస్ట్ ఇంఫాల్ జిలల్లా సరిహద్దుల్లో సైతం కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణ ప్రజలపై సాయుధులు కాల్పులకు తెగబడుతున్నారని స్థానిక అధికారులు బుధవారం వెల్లడించారు.
శాంతి స్థాపక కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను చేర్చడంపైనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎంపికను మెయితీలు సమర్థిస్తుండగా కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
51 మంది సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి గవర్నర్ నాయకత్వం వహిస్తున్నారు. మెయితీ వర్గాల వ్యక్తులను కమిటీకి ఎంపిక చేసేటప్పుడు తమను సంప్రదించలేదని కుకీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు