56ఏళ్లుగా బామ్మ కడుపులోనే పిండం.. వైద్యుల షాక్
56 ఏళ్లుగా ఓ మహిళ తన కడుపులో పిండం మోస్తుంది. పెళ్లయిన మహిళా గర్భం దాల్చిన తర్వాత తొమ్మిది నెలలు అటు ఇటుగా పండంటి బిడ్డలను కనడం మామూలుగానే చూస్తాం

విధాత, బ్రెజిల్: 56 ఏళ్లుగా ఓ మహిళ తన కడుపులో పిండం మోస్తుంది. పెళ్లయిన మహిళా గర్భం దాల్చిన తర్వాత తొమ్మిది నెలలు అటు ఇటుగా పండంటి బిడ్డలను కనడం మామూలుగానే చూస్తాం. కాకపోతే ఆ మహిళ మాత్రం తనకు తెలియకుండానే 56 సంవత్సరాల పాటు గర్భంతో ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమెకు సడన్ గా కడుపునొప్పి రావడంతో డాక్టరు దగ్గరికి వెళ్ళింది. దాంతో అసలు విషయం బయటపడింది. మొదటగా ఆమె పరిస్థితి చూసిన డాక్టర్లు షాక్ అయిపోయారు. ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో వెలుగు చూసింది. ఈ విస్మయకర ఘటన ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
బ్రెజిల్ దేశ మీడియా కథనాల ప్రకారం ఆ మహిళ పేరు దానియేలా..ఆమె ప్రస్తుత వయసు 81 సంవత్సరాలు. అయితే ఆవిడ, గత ఐదు దశాబ్దాలుగా కడుపులో పిండాన్ని మోస్తూ ఉంది. కాకపోతే ఆ పిండం మృతి చెందింది. చాలా సంవత్సరాల క్రితమే ఆమె కడుపులో ఉన్న పిండం చనిపోయింది. నిజానికి ఈ విషయాలు ఏవి ఆ మహిళకు తెలియకపోవడం విచిత్రం. ఆమె కడుపులో చాలా సంవత్సరాల పాటు మృతి చెందిన పిండం ఉండడం వల్ల అది కాస్త కడుపులో గడ్డకట్టుకు పోయింది. ఇన్ని రోజులు బాగానే ఉన్నా, తాజాగా ఆమెకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. అయితే వృద్ధురాలు కావడంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించారు. దాంతో అసలు విషయం బయట పడడంతో డాక్టర్లు కూడా షాక్ గురి కావల్సి వచ్చింది.