Hyderabad | హైదరాబాద్‌లో బాలుడిన హత్య చేసిన హిజ్రా.. నరబలిగా అనుమానం..!
Hyderabad | హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సనత్ నగర్ పరిధిలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని నరబలి ఇచ్చినట్లు బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సనత్ నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్ పరిధిలోని అల్లాదున్ కోటిలో వసీంఖాన్ అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఖాన్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. అయితే అదే ఏరియాలో ఉంటున్న ఫిజాఖాన్ అనే ఓ హిజ్రా వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు. […]

Hyderabad |
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సనత్ నగర్ పరిధిలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని నరబలి ఇచ్చినట్లు బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సనత్ నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. సనత్‌నగర్ పరిధిలోని అల్లాదున్ కోటిలో వసీంఖాన్ అనే వ్యక్తి తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఖాన్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. అయితే అదే ఏరియాలో ఉంటున్న ఫిజాఖాన్ అనే ఓ హిజ్రా వద్ద వసీంఖాన్ చిట్టీలు వేశాడు.
తనకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఫిజాఖాన్‌తో వసీం ఖాన్ గురువారం గొడవ పడ్డాడు. అయితే గురువారం రాత్రి తన కుమారుడు(8) కనిపించక పోయే సరికి వసీంఖాన్ తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు.
గురువారం సాయంత్రం వసీంఖాన్ కుమారుడిని బస్తీకి చెందిన ఓ నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఓ ప్లాస్టిక్ బ్యాగులో వేసుకుని ఫిజాఖాన్ ఇంటి వైపునకు తీసుకెళ్లారు. ఈ ఆధారాలతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడిని చంపి జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించారు.
గురువారం అర్ధరాత్రి స్థానికుల సాయంతో ఆ నాలాలో పోలీసులు వెతికారు. ప్లాస్టిక్ సంచిలో ఉన్న మృత దేహాన్ని బయటకు వెలికితీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు, ఎముకలను ఎక్కడికక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. అనంతరం ఆ బకెట్‌ను ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి, నాలాలో పడేశారు.
బాలుడిని నరబలి ఇచ్చారా..? లేక చిట్టీల డబ్బుల నేపథ్యంలో చోటు చేసుకున్న గొడవ కారణంగానే హతమార్చారా..? అన్న విషయం తేలాల్సి ఉంది. ఫిజాఖాన్‌తో పాటు బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురిని పోలీసులు విచారిస్తున్నారు.