Viral Video | ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Viral Video | ఓ గ్రామంలో చిరుత హల్‌చల్ చేసింది. ఆ చిరుతను ఊరి నుంచి తరిమేందుకు గ్రామస్తులందరూ ఏకమయ్యారు. కానీ అది ఓ ఇంట్లోకి ప్రవేశించి, ఆ ఇంటి యజమానిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లాలోని జవాన్ గ్రామంలోకి శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఓ చిరుత ప్రవేశించింది. అప్రమత్తమైన గ్రామస్తులు.. చిరుతను తరిమేందుకు సిద్ధమయ్యారు. ఇక చిరుతను వెంబడిస్తున్న క్రమంలో అది తన ప్రాణాలను రక్షించుకునేందుకు […]

Viral Video | ఓ గ్రామంలో చిరుత హల్‌చల్ చేసింది. ఆ చిరుతను ఊరి నుంచి తరిమేందుకు గ్రామస్తులందరూ ఏకమయ్యారు. కానీ అది ఓ ఇంట్లోకి ప్రవేశించి, ఆ ఇంటి యజమానిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లాలోని జవాన్ గ్రామంలోకి శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఓ చిరుత ప్రవేశించింది. అప్రమత్తమైన గ్రామస్తులు.. చిరుతను తరిమేందుకు సిద్ధమయ్యారు. ఇక చిరుతను వెంబడిస్తున్న క్రమంలో అది తన ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ ఇంట్లోకి వెళ్లింది. చిరుత అరుపులతో అప్రమత్తమైన ఆ ఇంటి యజమాని, కిచెన్‌లోకి పరుగెత్తి తలుపులు మూసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు జవాన్ గ్రామానికి చేరుకున్నారు. ఇక ఆపరేషన్‌లో భాగంగా చిరుతకు మత్తు మందు ఇచ్చారు. అది స్పృహ కోల్పోయిన తర్వాత, బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు తమ వాహనంలో చిరుతను తీసుకెళ్లారు. చిరుతను తమ కెమెరాల్లో బంధించేందుకు స్థానికులు ఎగబడ్డారు.
ఈ సందర్భంగా బాధిత వ్యక్తి మాట్లాడుతూ.. శనివారం ఉదయం 9:45 గంటల సమయంలో నా ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. నాపై దాడి చేసేందుకు చిరుత యత్నించింది. నేను అప్రమత్తమై కిచెన్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాను. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. లైట్లను, ఇన్‌వర్డర్‌తో పాటు ఇతర వస్తువులను చిరుత ధ్వంసం చేసింది అని తెలిపాడు.
#WATCH | Leopard safely rescued from a house in the Jawan village of Aligarh, after the feline entered it earlier today#UttarPradesh pic.twitter.com/5LM60agPU0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2023