High inflation | రానున్న నెలల్లో అధిక ద్రవ్యోల్బణం

High inflation | జూలైలో గరిష్ఠస్థాయి ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో మరింత పైపైకి ఆగస్ట్‌ తర్వాత అదుపులోకి టమాట కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: జూలై నెలలో దేశ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠస్థాయిలో 7.4 శాతంగా ఉన్నదని ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొన్నది. రానున్న కొద్ది నెలలపాటు ఇది పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. జూలై నెలకు గాను ఆర్థిక శాఖ నెలవారీ సమీక్షను విడుదల చేసింది. ‘దేశీయ అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా […]

High inflation | రానున్న నెలల్లో అధిక ద్రవ్యోల్బణం

High inflation |

  • జూలైలో గరిష్ఠస్థాయి ద్రవ్యోల్బణం
  • రానున్న నెలల్లో మరింత పైపైకి
  • ఆగస్ట్‌ తర్వాత అదుపులోకి టమాట
  • కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: జూలై నెలలో దేశ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠస్థాయిలో 7.4 శాతంగా ఉన్నదని ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొన్నది. రానున్న కొద్ది నెలలపాటు ఇది పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. జూలై నెలకు గాను ఆర్థిక శాఖ నెలవారీ సమీక్షను విడుదల చేసింది.

‘దేశీయ అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా కలిగిన ప్రాథమిక అంతరాయాలతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మళ్లీ ఉద్భవించాయి’ అని నివేదిక పేర్కొన్నది. ద్రవ్యోల్బణ ధోరణుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నివేదిక రాస్తున్న సమయంలో.. ఆగస్ట్‌లో వర్షాభావం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నదని తెలిపింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అధికారంగా ఉండనున్నా.. ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయిని తెలిపింది. జూలైలో నమోదైన ఆహార ద్రవ్యోల్బణం.. 2014లో సీపీఐ సిరీస్‌ మొదలైన తర్వాత బహుశా మూడవ అతిపెద్దదని పేర్కొన్నది. కానీ.. 48 రకాల ఫుడ్‌ ఐటమ్స్‌పై 6శాతమే ద్రవ్యోల్బణం పెరిగిందని తెలిపింది.

‘టమాటా, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లిపై ద్రవ్యోల్బణం 50 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. అందుకే జూలైలో అధిక స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం నమోదైందని పేర్కొన్నది. అయితే.. పైన పేర్కొన్న వాటి ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయని తెలిపింది. ఆగస్ట్‌ చివరి నాటికి లేదా సెప్టెంబర్‌ మొదటివారిలో టమాటా తాజా స్టాక్‌ మార్కెట్‌కు వస్తుందని, అవి రాగానే టమాటా ధరలు తగ్గుతాయని పేర్కొన్నది.