TSPSC | టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ సంచలన నిర్ణయం
విధాత: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు, సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. అనితా రామచంద్రన్, లింగారెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు. కార్యదర్శి అనితా రామచంద్రన్ పీఏగా ప్రవీణ్ పని చేస్తుండగా, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి పీఏగా రమేశ్ పని చేస్తున్నాడు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే ప్రవీణ్, రమేశ్‌ను అరెస్టు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రమేశ్ […]

విధాత: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు, సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.
అనితా రామచంద్రన్, లింగారెడ్డి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు. కార్యదర్శి అనితా రామచంద్రన్ పీఏగా ప్రవీణ్ పని చేస్తుండగా, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డి పీఏగా రమేశ్ పని చేస్తున్నాడు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే ప్రవీణ్, రమేశ్‌ను అరెస్టు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రమేశ్ 100కు పైగా మార్కులు సాధించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అనితా రామచంద్రన్, లింగారెడ్డితో పాటు చైర్మన్, మిగతా సభ్యులకు కూడా సిట్ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఈ కేసులో 100కు పైగా మార్కులు సాధించిన 84 మంది అభ్యర్థులను సిట్ విచారించింది. వారంతా నిజాయితీగా చదివి తెచ్చుకున్న మార్కులని తేలింది. ఈ 84 మందిలో కొందరు సివిల్స్‌కు ప్రిపేరవుతున్న వారు కూడా ఉన్నారు. గత కొన్నేండ్ల నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది.