Accident
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట సమీపంలో 63వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ బైక్ ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో బత్తుల శంకరయ్య (60), లక్ష్మి (55) ఘటన స్థలంలోనే మృతి చెందారు. దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. భార్యాభర్తలు వేంపల్లి గ్రామంలో శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న గ్రామంలో గుల్లకోట సమీపంలో ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.