లారీ బైక్ ఢీ.. ఇద్ద‌రు మృతి.. మ‌రొక‌రికి గాయాలు

విధాత, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండా వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం లారీ, ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు మృతి చెందారు. ద్విచ‌క్ర‌వాహ‌నం లారీ ఢీకొన్న సంఘ‌ట‌న‌లో పూర్ణిత(3) పాప తో పాటు తాత ధారావత్ పాశ్చ్య(70) ప్ర‌మాదం జ‌రిగిన చోటే మృతి చెందారు. ధారావత్ నాగమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు చెప్పారు.

  • By: krs    latest    Dec 09, 2022 11:55 AM IST
లారీ బైక్ ఢీ.. ఇద్ద‌రు మృతి.. మ‌రొక‌రికి గాయాలు

విధాత, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండా వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం లారీ, ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు మృతి చెందారు.

ద్విచ‌క్ర‌వాహ‌నం లారీ ఢీకొన్న సంఘ‌ట‌న‌లో పూర్ణిత(3) పాప తో పాటు తాత ధారావత్ పాశ్చ్య(70) ప్ర‌మాదం జ‌రిగిన చోటే మృతి చెందారు.

ధారావత్ నాగమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు చెప్పారు.