స‌ర్పంచ్‌కు జ‌ర్న‌లిస్ట్‌ అక్రిడిటేష‌న్ కార్డు.. ఆందోళ‌న చేసిన జ‌ర్న‌లిస్టులు.. ర‌ద్దు చేసిన క‌లెక్ట‌ర్

స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌న్న టీయూడ‌బ్యుజే జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాల‌రాజు విధాత‌: స‌ర్పంచ్‌కు జ‌ర్న‌లిస్ట్ అక్రిడిటేష‌న్ కార్డు ఇచ్చిన సంఘ‌ట‌న మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్ల‌లో జ‌రిగింది. దీంతో జిల్లా మీడియా అక్రిడేషన్ లో జ‌రిగిన అవకతవకల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి అన‌ర్హులైన వారి అక్రిడిటేష‌న్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం జిల్లా శాఖ ఆందోళ‌న‌ చేప‌ట్టింది. ఆందోళ‌న‌ల‌కు స్పందించిన జిల్లా క‌లెక్ట‌ర్ స‌ర్పంచ్ గుండు మ‌నీష్ గౌడ్‌కు ఇచ్చిన జ‌ర్న‌లిస్ట్‌ అక్రిడిటేష‌న్ […]

  • By: krs    latest    Dec 07, 2022 1:59 AM IST
స‌ర్పంచ్‌కు జ‌ర్న‌లిస్ట్‌ అక్రిడిటేష‌న్ కార్డు.. ఆందోళ‌న చేసిన జ‌ర్న‌లిస్టులు.. ర‌ద్దు చేసిన క‌లెక్ట‌ర్

స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌న్న టీయూడ‌బ్యుజే జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాల‌రాజు

విధాత‌: స‌ర్పంచ్‌కు జ‌ర్న‌లిస్ట్ అక్రిడిటేష‌న్ కార్డు ఇచ్చిన సంఘ‌ట‌న మేడ్చ‌ల్‌- మ‌ల్కాజిగిరి జిల్ల‌లో జ‌రిగింది. దీంతో జిల్లా మీడియా అక్రిడేషన్ లో జ‌రిగిన అవకతవకల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి అన‌ర్హులైన వారి అక్రిడిటేష‌న్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం జిల్లా శాఖ ఆందోళ‌న‌ చేప‌ట్టింది.

ఆందోళ‌న‌ల‌కు స్పందించిన జిల్లా క‌లెక్ట‌ర్ స‌ర్పంచ్ గుండు మ‌నీష్ గౌడ్‌కు ఇచ్చిన జ‌ర్న‌లిస్ట్‌ అక్రిడిటేష‌న్ కార్డును ర‌ద్దు చేశారు. కార్డు తీసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డీపీఆర్వోను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. యూటూబ్ చానల్స్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.

నిజ‌మైన జ‌ర్న‌లిస్టుల‌కు అన్యాయం జ‌ర‌గ‌వ‌ద్ద‌ని తెలిపారు. అనంత‌రం టియూడబ్ల్యుజె రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు మోతే వెంక‌ట్‌రెడ్డి, జిల్లా అధ్య‌క్షుడు గ‌డ్డ‌మీది బాల‌రాజులు జిల్లాలోన జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌ను క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చి వాటిని ప‌రిష్క‌రించాలని కోరారు.

జ‌ర్న‌లిస్టుల స్థ‌లానికి కంచె వేయండి

కాచివాని సింగారం గ్రామంలో జర్నలిస్టులకు ఇచ్చిన ప‌ట్టాల స‌మ‌స్యను యూనియ‌న్ నాయ‌కులు క‌లెక్ట‌ర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పంధించిన క‌లెక్ట‌ర్‌ మంత్రి స‌బితాఇంద్రారెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌మ‌స్య త్వ‌ర‌లోనే ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

అప్ప‌టి వ‌ర‌కు స్థ‌లాన్ని ప‌రిర‌క్షించాల‌ని యూనియ‌న్ జిల్లా కార్య‌ద‌ర్శి వెంక‌ట్రామిరెడ్డి క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. వెంట‌నే ఆయ‌న ఘట్ కేస‌ర్‌ మండల తాసిల్దార్‌కు ఫోన్ చేసి కాచివాని సింగారం జర్నలిస్టుల స్థలానికి కంచె వేయాల‌ని ఆదేశించారు.