Adilabad | కనువిందు చేస్తున్న.. ఖండాల అందాలు
Adilabad ప్రకృతి ఒడిలో సుందర ప్రదేశం కొండలు, గుట్టల మధ్య సవ్వడి చేస్తున్న జలపాతాలు అభివృద్ది చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: ఆకాశాన్ని తాకేలా ఎత్తైన కొండలు గుట్టల మధ్య సవ్వడి చేసే అందమైన జలపాతాలు.. చుట్టు పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య అక్కడక్కడ విసిరేసినట్లు కనిపించే గిరిజన తండాలు.. అలాగే కొండలపై నుండి కదలాడే మేఘాలు… వంపులు తిరుగుతూ కొండల మీద నుండి వెళ్లే నల్లటి తారు […]

Adilabad
- ప్రకృతి ఒడిలో సుందర ప్రదేశం
- కొండలు, గుట్టల మధ్య సవ్వడి చేస్తున్న జలపాతాలు
- అభివృద్ది చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం
విధాత, ఉమ్మడి అదిలాబాద్ ప్రతినిధి: ఆకాశాన్ని తాకేలా ఎత్తైన కొండలు గుట్టల మధ్య సవ్వడి చేసే అందమైన జలపాతాలు.. చుట్టు పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య అక్కడక్కడ విసిరేసినట్లు కనిపించే గిరిజన తండాలు.. అలాగే కొండలపై నుండి కదలాడే మేఘాలు… వంపులు తిరుగుతూ కొండల మీద నుండి వెళ్లే నల్లటి తారు రోడ్డును కప్పేసే మంచు దుప్పటిలా ఉంటాయి. ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రకృతి రమణీయతలను పొదిగి ఉండి పర్యాటకులను కట్టిపడేస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతాలు ఇక్కడ గుట్టల్లో ఉన్న రెండు మూడు జలపాతాలు కలిసి ఖండాల జలపాతంగా చెబుతారు. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తే ఎవరికైనా అక్కడే ఉండాలనిపిస్తుంది. ఎండా, వానా, చలి అని తేడా లేకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ కాశ్మీర్‌ను తలపించేలా కనువిందు చేస్తున్న ప్రకృతి సౌందర్యం ఖండాల సొంతం.
ఎత్తైన కొండలు.. చుట్టూ దట్టమైన అడవి, అన్నిటికిమించి కనువిందు చేసే సుందర జలపాతాలు, అడవిలో కనిపించే పకృతి సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయనడంలో అతిశయోక్తి కాదు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి 25 నుండి 30 కిలో మీటర్ల దూరంలో ఉండే ఖండాలు చూడ ముచ్చటగా ఉంటాయి. దారి పొడవునా ఎటు చూసినా మైమరిపించే ప్రకృతి అందాలు కనివిందు చేస్తాయి. మేఘాలు, పొగమంచు ఈ గిరిజన గూడేలను తాకుతూ వెళ్ళే దృశ్యాలను చూస్తే తెలియని అనుభూతికి లోను చేస్తాయి. ఈ దృశ్యాలను చూడాలంటే తెల్లవారుజామునే ఖండాలకు చేరుకుంటే చూడవచ్చు.
గుట్టలపై వంపులు తిరుగుతూ వెళ్ళే రోడ్డు ప్రయాణంలో అలసటన్నది తెలియనివ్వదు. దారి పొడవునా ఉన్న ప్రకృతి అందాలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తాయి. ఎటు చూసినా మనసుకు హాయినిచ్చె ప్రకృతి సోయగాలే దర్శనమిస్తాయి. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియకపోయినప్పటికి ఈ ఖండాలకు ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం లభిస్తోంది.
సెలవులు, ఇతర సమయాల్లో సందర్శకులు ఇక్కిడికి వచ్చి ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించి వెళతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా సందర్శకులు వస్తున్నారు.
పర్యాటకంగా మరింత అభివృద్ది చేసి, కొన్ని సదుపాయాలు కల్పిస్తే మరింత ప్రాచూర్యం పొందే అవకాశం ఉంది. ఎండా, వానా, చలి అనే తేడా లేకుండా ప్రకృతి అందాలతో సందర్శకులను కట్టిపడేసే ఖండాల అందాలను మీరు ఒకసారి దర్శించండి.