అదితీరావుపై మాజీ భర్త సంచలన ఆరోపణలు..! పెళ్లి అంటేనే భయం వేసింది!

విధాత‌: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అదితీ రావు హైదరి. హైదరాబాద్‌కు చెందిన ఈ నటి మోడలింగ్‌లో అడుగుపెట్టి అనంతరం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి పేరు సంపాదించుకుంది. మమ్ముట్టి నటించిన ప్రజాపతి అనే సినిమాతో దక్షిణాదిన తెరంగేట్రం చేసింది. ఎక్కువగా మణిరత్నం సినిమాలలో నటిస్తూ అస్థాన నాయకిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన స‌మ్మోహ‌నం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నాని, సుధీర్‌బాబులతో V, వరుణ్‌తేజ్‌ అంతరిక్షం, […]

అదితీరావుపై మాజీ భర్త సంచలన ఆరోపణలు..! పెళ్లి అంటేనే భయం వేసింది!

విధాత‌: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అదితీ రావు హైదరి. హైదరాబాద్‌కు చెందిన ఈ నటి మోడలింగ్‌లో అడుగుపెట్టి అనంతరం బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి పేరు సంపాదించుకుంది. మమ్ముట్టి నటించిన ప్రజాపతి అనే సినిమాతో దక్షిణాదిన తెరంగేట్రం చేసింది. ఎక్కువగా మణిరత్నం సినిమాలలో నటిస్తూ అస్థాన నాయకిగా పేరు తెచ్చుకుంది.

తెలుగులో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన స‌మ్మోహ‌నం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నాని, సుధీర్‌బాబులతో V, వరుణ్‌తేజ్‌ అంతరిక్షం, శర్వానంద్- సిద్ధార్థ్‌లు కలిసి నటించిన మహాసముద్రంలో నటించింది. ఈ మూవీ సమయంలోనే సిద్ధార్థతో ఆమెకు కుదిరిన స్నేహం వారిద్దరు డేటింగ్ చేస్తున్నారని కథనాలు కూడా వస్తున్నాయి.

రీసెంట్‌గా శర్వానంద్ నిశ్చితార్థంలో ఈ జంట కనిపించింది. శ‌ర్వానంద్ ఆయ‌న‌కు కాబోయే శ్రీ‌మ‌తితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో అంద‌రూ వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అయితే అదితీరావు హైద‌రి 2009లోనే బాలీవుడ్ నటుడు సత్య దీప మిశ్రాను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావడంతో 2013లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి విడివిడిగా ఉంటున్నారు.

తాజాగా సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి నీనా గుప్త కూతురు మసబ్ గుప్తాని రెండో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అదితీతో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ పెళ్లి అంటే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్ళు మళ్ళీ రిలేషన్ ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే కోల్పోయినవి పొందగలం అని తెలిపారు.