చంద్రబాబు కేసుల్లో వాయిదాల పర్వం

చంద్రబాబు కేసుల్లో వాయిదాల పర్వం !!
కష్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ నేటికీ వాయిదా!!
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు భవితవ్యం నేడు తేలనున్నదా ? ఆయన్ను ఇంకా విచారించాల్సి ఉన్నందున తమ కష్టడీకి ఇవ్వాలని కోరిన సీఐడీ కోరిక నెరవేరుతుందా ? ఆయన కేసును పూర్తిగా కొట్టేయలంటూ హై కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కూడా శుక్రవారం విచారణకు రానుంది . అది తేలితే తప్ప ఆయన్ను సీఐడీ కష్టడీకి ఇచ్చే అంశం తేలదు.
దీంతో శుక్రవారం పలు కీలక సందేహాలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి మీద ప్రభుత్వం ఇంకో కేసు బుక్ చేయగా దానిమీద బెయిల్ కోసం చంద్రబాబు వేసుకున్న పిటిషన్ మీద విచారణ ఈనెల 26కు వాయిదా పడింది.

Adjournments in Chandrababu’s casesఈ కేసులో ఏపీ సీఐడీ తరుఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. ఇక ఈ కేసుల అంశం తమకు లాభిస్తుందని టిడిపి భావిస్తోంది. ఎక్కడికక్కడ సభలు.. .సమావేశాలు నిర్వహించి ఆయనకు మద్దతుగా సంతకాల సేకరణ చేపడుతోంది.