Chhattisgarh | భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 20 ఏండ్ల క్రితం చంపా.. ఇప్పుడు కలలోకి వచ్చి వేధిస్తున్నాడు..
Chhattisgarh | ఓ వ్యక్తి తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని 20 ఏండ్ల క్రితం చంపేశాడు. గతేడాది కాలం నుంచి ఆ వ్యక్తి తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని చెప్పిన ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ బాలోద్‌లోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియారా.. తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే 2003లో తన భార్యతో ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించి అతనిని హత్య చేసి మరొకరికి తెలియకుండా […]

Chhattisgarh |
ఓ వ్యక్తి తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని 20 ఏండ్ల క్రితం చంపేశాడు. గతేడాది కాలం నుంచి ఆ వ్యక్తి తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని చెప్పిన ఘటన కలకలం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ బాలోద్‌లోని కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియారా.. తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే 2003లో తన భార్యతో ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించి అతనిని హత్య చేసి మరొకరికి తెలియకుండా పూడ్చి పెట్టాడు.
సీన్ కట్ చేస్తే.. గత ఏడాది కాలం నుంచి ఛవేశ్వర్ తన కలలోకి వచ్చి వేధిస్తున్నాడని కొలియారా గ్రామస్థులకు తెలిపాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే ఛవేశ్వర్‌ను చంపినట్లు పేర్కొన్నాడు. దీంతో గ్రామస్తులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొలియారాను అదుపులోకి తీసుకున్నారు. అతను చెప్పిన ఆధారాలతో మృతదేహం ఆచూకీ కోసం తవ్వకాలు చేపట్టారు. కానీ డెడ్‌బాడీ లభించలేదు. కొలియారా మానసిక ఆరోగ్యం కూడా బాగాలేదని, అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.
కానీ ఛవేశ్వర్ తండ్రి మాత్రం పట్టు విడవలేదు. తన కుమారుడి డెడ్ బాడీ కోసం తవ్వకాలు జరపాలని అధికారులను ఆశ్రయించాడు. బుధవారం మరోసారి తవ్వకాలు చేపట్టగా.. స్థానికంగా ఉన్న ఓ డ్యామ్ పక్కన జరిపిన తవ్వకాల్లో ఎముకలు, వస్త్రాలు బయటపడ్డాయి. డీఎన్ఎ పరీక్షల నిమిత్తం ఎముకలను ల్యాబ్‌కు పంపారు. ఇదిలాఉండగా గత కొన్ని రోజుల నుంచి కొలియారా కనిపించకుండా పోవడం గమనార్హం.