Airfares | మూడు రెట్లు పెరిగిన విమాన చార్జీలు.. కోరమండల్ రైల్ ప్రమాదం ఎఫెక్ట్
డైరెక్ట్ ఫ్లట్ టికెట్లు దొరకడం లేదు కనెక్టింగ్ ఫ్లైట్ టికెట్లు మాత్రమే గతంలో 4000-5000 ఉన్న టికెట్ ధర నేడు 15920-21947 పలుకుతున్నది విధాత: విమాన టికెట్ల ధరలకు (Airfares) రెక్కలొచ్చాయి. సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా పెరిగాయి. గడిచిన ఐదు రోజుల్లో హైదరాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు టికెట్ల ధరలు డబుల్ అయ్యాయి. ఈ అధిక రేట్ల వ్యవహారం మరో రెండు మూడు రోజులపాటు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. గత వారం ఒడిశాలోని […]

- డైరెక్ట్ ఫ్లట్ టికెట్లు దొరకడం లేదు
- కనెక్టింగ్ ఫ్లైట్ టికెట్లు మాత్రమే
- గతంలో 4000-5000 ఉన్న టికెట్ ధర
- నేడు 15920-21947 పలుకుతున్నది
విధాత: విమాన టికెట్ల ధరలకు (Airfares) రెక్కలొచ్చాయి. సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా పెరిగాయి. గడిచిన ఐదు రోజుల్లో హైదరాబాద్, న్యూఢిల్లీ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు టికెట్ల ధరలు డబుల్ అయ్యాయి. ఈ అధిక రేట్ల వ్యవహారం మరో రెండు మూడు రోజులపాటు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
గత వారం ఒడిశాలోని బాలసోర్‌లో ఘోర రైళ్ల ప్రమాదం జరుగడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. మరో వైపు సెలవులు ముగిసిపోతుండటం, సోమవారం నుంచి పాఠశాలలు మొదలు కానున్న నేపథ్యంలో చాలా రైళ్లలో టికెట్లు దొరకడం లేదు. శుక్రవారం రైలు ప్రమాదం తర్వాత శనివారం నుంచే అనేక మంది ప్రయాణికులు విమాన టికెట్ల రేట్ల గురించి వాకబు చేసినట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లు దొరకడం లేదు. విశాఖ పట్నం-న్యూఢిల్లీ రూట్లో వెళ్లేందుకు మరో రెండు రోజుల వరకు టికెట్లు అందుబాటులో లేవు. గత రాత్రి చివరి విమానం టికెట్ ఒకటి దొరికిందని ఓ ఏజెంట్ పేర్కొన్నారు.
గత ఆరు రోజులుగా విమాన చార్జీలు భారీగా పెరిగాయని ఎయిర్ ట్రావెల్లర్స్ తెలిపారు. హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఒక స్టాప్ విమానాల్లో హైదరాబాద్‌కు చార్జీలు మూడు రెట్లు పెరిగాయని ఓ ప్రయాణికుడు వాపోయాడు.
హైదరాబాద్-విశాఖపట్నం మధ్య కనెక్టింగ్ ఫ్లైట్స్‌సహా డైరెక్ట్ విమాన టికెట్లు కూడా శుక్ర, శనివారాలకు పూర్తిగా అమ్ముడుపోయాయి. విశాఖ, బెంగళూరు, తిరుపతికి గతంలో టికెట్లు ధరలు గతంలో 4000-5000 ఉండగా, ఇప్పుడు1,5920-21947 పలుకుతున్నాయి.