Aghori matha: అఘోరి మహిళా.. పురుషుడా?

Aghori matha: అఘోరి మహిళా.. పురుషుడా?

విధాత, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలలో తరుచు తన వింత చేష్టలతో హల్చల్ చేస్తూ సంచలనాలు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అఘోరి మాత (Aghori Mata)వ్యవహారంలో మరో ఆసక్తికర ట్వీస్టు(Interesting twist) వెలుగుచూసింది. అబ్బాయిగా పుట్టిన అఘోరి మాతా( శ్రీనివాస్) జెండర్ ఏమిటన్నది (What is the gender) మరోసారి చర్చనీయాంశమైంది.

తన పేరు శివ విష్ణు బ్రహ్మగా చెప్పుకునే అఘోరి మాత ఆధార్ కార్డులో మహిళ (Female in Aadhaar card)గా పేర్కొన్నారు. కాని 2024లో జెండర్ రీసెస్మెంట్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ (medical certificate) లో పురుషుడి(male)గా పేర్కొన్నారు. అఘోరి మాత ట్రాన్స్ జెండర్(Transgender)అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి కానీ మహిళగా పేర్కొన్నారు. అలా ఎందుకు నమోదు చేశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఆధార్ కార్డులో పేరు మార్పుకు ఎన్నో ప్రూఫ్స్ కావాలి. అలాంటిది అఘోరికి ఫిమేల్ అని ఎలా ఆధార్ కార్డు ఇచ్చారన్నది ఇప్పుడు మరో వివాదస్పద అంశమైంది. అయితే అఘోరిని మహిళాగా పేర్కొన్న ఆధార్ కార్డు 1997జనవరిలో జారీ కాబడింది. ఆ తర్వాత శ్రీనివాస్ మహిళగా మారితే ఆధార్ లో మహిళగానే ఎందుకు నమోదు చేశారన్నది మరో మిస్టరీగా ఉంది.

అఘోరి మాత స్వంతగ్రామం మంచిర్యాల జిల్లా మండలం కుశ్నపల్లి. అఘోరిగా మారక ముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్. అఘోరి తండ్రి ఏల్లూరీ చిన్నయ్య, తల్లి చిన్నక్క. వీరికి మూడో సంతానంగా శ్రీనివాస్ జన్మించాడు. శ్రీనివాస్ కు ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. వేమనపల్లి ఎస్సీ హాస్టల్ లో ఆరవ తరగతి వరకు శ్రీనివాస్ చదువుకున్నట్లు సమాచారం. ఆరో తరగతి లోనే హాస్టల్ నుండి వెళ్లిపోయి శ్రీనివాస్ అఘోరిలా మారినట్లు సమాచారం.

ట్రాన్స్ జెండర్ గా మారిన శ్రీనివాస్ పదహారు సంవత్సరాల తర్వాత 10నెలల క్రితం స్వంత ఇంటికి వచ్చి తల్లిదండ్రులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాం ధ్వంసం తర్వాత ఆలయంలో నగ్న పూజలతో అఘోరి మాత హల్చల్ గా మారారు. అప్పటి నుంచి తెలంగాణలో లేడీ అఘోరి మాత అనేక మీడియా ఛానెల్స్ లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యారు.

సాధారణ నాగసాధువులకు భిన్నంగా కారు, సెల్ ఫోన్లు, ఇంటర్య్వూలతో చర్చనీయాంశమైంది. తాను నాగ సాధువునంటూ పంచ భూతాలు తమ ఆధీనంలో ఉంటాయని, తమకు కూడా మహిళల మాదిరిగా పీరియడ్స్ వస్తాయని, ఆసమయంలో మాత్రం ఆలయాలకు దూరంగా ఉంటామన్నారు. దిగంబరంగా ఉంటానని..శవాలను భుజిస్తానని..హిందూ ధర్మ పరిరక్షణకు తాను హిమాలయాల నుంచి వచ్చి దేశంలో పర్యటిస్తున్నానని చెప్పుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించిన సందర్భంగా వస్త్రధారణ పాటించకుండా వివాదాలు రేపారు. ఇటీవల కొమురవెల్లి ఆలయంలో భక్తులపై కత్తితో దాడికి పాల్పడింది. ఆత్మార్పణ యత్నాలతో పలుసార్లు పోలీసులకు చుక్కలు చూపారు. కేసుల పాలయ్యారు. తాజాగా ఏపీలోని తణుకులో అఘోరా బాబా రాజేష్ నాథ్ మహిళలను మోసం చేస్తున్నాడని..తాను అతని అంతుచూస్తానంటూ హల్చల్ చేసింది.

అక్కడి నుంచి గుంటూరుకు వెళ్లి హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహరాతో గొడవ పడింది. అఘోరి అసలు మహిళ కాదని..శ్రీనివాస్ అని.. తనకు సంబంధించి అన్ని రుజువులు తన వద్ద ఉన్నాయని అనిల్ బెహరరా సంచలన ప్రకటన చేశారు. కేవలం అవయవాలు మార్పిడి మాత్రమే జరిగిందని, ట్రాన్స్ జెండర్ కాదన్నారు. లేడీ అఘోరి శ్రీనివాస్ బ్రెస్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడన్నారు. అఘోరిని ఎవరు నమ్మవద్ధని చెప్పాడు.