Aishwarya Rajesh | మెచ్చుకుంటున్నారే గానీ.. పెద్ద సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం లేదు: ఐశ్యర్య రాజేశ్
Aishwarya Rajesh | ఐశ్వర్య రాజేశ్ అందరికీ సుపరిచితమే. ఎక్కువగా సినిమాలు చేసింది తమిళంలో అయినా.. ఐశ్యర్య అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి దివంగత రాజేశ్ 1980లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. అప్పట్లో ఇండస్టీ చెన్నైలో ఉండడంతో వారి కుటుంబం తమిళనాడులో స్థిర పడింది. మరో విషయం ఎంటంటే ప్రముఖ హస్యనటి శ్రీలక్ష్మి రాజేశ్‌కు స్వయానా సోదరి. ఐశ్వర్య సైతం తన కెరీర్‌ను అక్కడి నుంచే ప్రారంభించింది. తెలుగులో […]

Aishwarya Rajesh |
ఐశ్వర్య రాజేశ్ అందరికీ సుపరిచితమే. ఎక్కువగా సినిమాలు చేసింది తమిళంలో అయినా.. ఐశ్యర్య అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి దివంగత రాజేశ్ 1980లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. అప్పట్లో ఇండస్టీ చెన్నైలో ఉండడంతో వారి కుటుంబం తమిళనాడులో స్థిర పడింది. మరో విషయం ఎంటంటే ప్రముఖ హస్యనటి శ్రీలక్ష్మి రాజేశ్‌కు స్వయానా సోదరి.
ఐశ్వర్య సైతం తన కెరీర్‌ను అక్కడి నుంచే ప్రారంభించింది. తెలుగులో రాజేంద్రప్రసాద్‌తో కలిసి కౌసల్యా కృష్ణమూర్తితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింఇ. అనంతరం విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, నానితో టక్ జగదీశ్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నది. ముఖ్యంగా ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
అయితే, తనకు పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవడంపై, కెరీర్‌లో ఎదుర్కొంటున్న పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసింది. స్టార్ డైరెక్టర్లు, సెలెబ్రెటీ ఫిలిం మేకర్లపై అసహనం వ్యక్తం చేసింది. గ్లామరస్ ఇండస్ట్రీలో హీరోల కంటే.. హీరోయిన్లే ఎక్కువ మంది ఉన్నారని, దాంతో ఎక్కువ అవకాశాలు రావడం లేదని తెలిపింది.
తనను చాలా మంది స్టార్ నటులు ప్రశంసించారని, ప్రముఖులు యాక్టింగ్ స్కిల్స్‌ను మెచ్చుకుంటున్నా రని.. కానీ, వారి ప్రాజెక్టుల్లోకి మాత్రం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎందుకు భారీ, స్టార్ హీరోలతో నటించే సినిమాల్లోకి తీసుకోవడం లేదనే విషయంపై వివరణ ఇచ్చింది.
తాను చిన్న బడ్జెట్ సినిమాలు, ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నా నని చెప్పింది. తనను అభిమానించే, ఆధారించే వారు సైతం ఉన్నారని.. అందుకే అవే సినిమాలు చేస్తున్నానని వెల్లడించింది. ఇప్పటికే అలాంటివే 15 సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఏడాది ఐశ్యర్య నటించిన ఐదు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ఐశ్యర్య లీడ్‌లో నటించిన ‘ఫర్హానా’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఐశ్యర్య చేతిలో ఏడు ప్రాజెక్టులున్నాయి. ఇందులో నాలుగు తమిళ్, మూడు మలయాళ సినిమాలున్నాయి. ‘ధ్రువ నక్షత్రం, మోహన్‌దాస్’ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.