Akash Ambani | అంబానీ ఇంట వార‌సురాలు.. మ‌రోసారి త‌ల్లిదండ్రులైన ఆకాశ్‌, శ్లోకా దంప‌తులు

Akash Ambani | పారిశ్రామిక దిగ్గ‌జం ముకేశ్ అంబానీ మ‌రోసారి తాత అయ్యారు. ఆయ‌న పెద్ద కుమారుడు, కోడలు ఆకాశ్ అంబానీ, శ్లోక మెహ‌తా మ‌రోసారి త‌ల్లిదండ్రులు అయ్యారు. ఈ దంప‌తుల‌కు నిన్న పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది. వార‌సురాలు రావ‌డంతో ముకేశ్ అంబానీ ఇంట సంతోషం నెల‌కొంది. ఆకాశ్, శ్లోక దంప‌తుల‌కు తొలి కాన్పులో 2020, డిసెంబ‌ర్‌లో పృథ్వీ ఆకాశ్ అంబానీ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. వీరికి 2019లో వివాహం జ‌రిగిన విష‌యం విదిత‌మే. వారం రోజుల […]

Akash Ambani | అంబానీ ఇంట వార‌సురాలు.. మ‌రోసారి త‌ల్లిదండ్రులైన ఆకాశ్‌, శ్లోకా దంప‌తులు

Akash Ambani | పారిశ్రామిక దిగ్గ‌జం ముకేశ్ అంబానీ మ‌రోసారి తాత అయ్యారు. ఆయ‌న పెద్ద కుమారుడు, కోడలు ఆకాశ్ అంబానీ, శ్లోక మెహ‌తా మ‌రోసారి త‌ల్లిదండ్రులు అయ్యారు. ఈ దంప‌తుల‌కు నిన్న పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించింది.

వార‌సురాలు రావ‌డంతో ముకేశ్ అంబానీ ఇంట సంతోషం నెల‌కొంది. ఆకాశ్, శ్లోక దంప‌తుల‌కు తొలి కాన్పులో 2020, డిసెంబ‌ర్‌లో పృథ్వీ ఆకాశ్ అంబానీ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. వీరికి 2019లో వివాహం జ‌రిగిన విష‌యం విదిత‌మే.

వారం రోజుల క్రితం శ్లోకా మెహ‌తా ముంబైలోని సిద్ధి వినాయ‌క ఆల‌యానికి వ‌చ్చారు. ఆమెతో పాటు భ‌ర్త ఆకాశ్ అంబానీ, కుమారుడు పృథ్వీ, మామ ముకేశ్ అంబానీ కూడా వ‌చ్చారు. పృథ్వీకి ప్ర‌స్తుతం రెండేండ్లు. కాగా ఆకాశ్ అంబానీ రిల‌య‌న్స్ జియో చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.