ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

విధాత, కార్తీక పౌర్ణమి సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో శివ కేశవుల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఘడియలు సోమవారం సాయంత్రం నుంచి రేపు మంగళవారం సాయంత్రం వరకు ఉన్నప్పటికీ చంద్రగ్రహణం కారణంగా ప్రజలు సోమవారం నాడు ఎక్కువగా కార్తీక పౌర్ణమి పర్వదిన పూజలు నిర్వహించారు. నది స్నానాలు, కార్తీక దీపారాధనలు, వ్రతాలతో ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుప్రసిద్ధ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి […]

  • By: krs    latest    Nov 07, 2022 8:03 AM IST
ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

విధాత, కార్తీక పౌర్ణమి సోమవారం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో శివ కేశవుల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఘడియలు సోమవారం సాయంత్రం నుంచి రేపు మంగళవారం సాయంత్రం వరకు ఉన్నప్పటికీ చంద్రగ్రహణం కారణంగా ప్రజలు సోమవారం నాడు ఎక్కువగా కార్తీక పౌర్ణమి పర్వదిన పూజలు నిర్వహించారు.

నది స్నానాలు, కార్తీక దీపారాధనలు, వ్రతాలతో ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుప్రసిద్ధ యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని సందర్శించుకుని కార్తీక దీపారాధనలు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. మత్స్యగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

అటు కృష్ణా నది తీరంలోని ప్రముఖ శివాలయాలు వాడపల్లి శ్రీఅగస్తేశ్వర స్వామి, మేళ్లచెరువు శంభు లింగేశ్వర స్వామి, అడవిదేవులపల్లి శివాలయం, మఠంపల్లి లక్ష్మీ నరసింహ ఆలయాల వద్ద నది స్నానాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలతో భక్తులు సందడి చేశారు సూర్యాపేట పిల్లలమర్రి శివాలయం నల్గొండ పానగల్ ఛాయా సోమేశ్వరాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో రుద్రాభిషేకాలు పూజలు నిర్వహించారు.