Alligator Bending Fence। ఇనుప చువ్వలు.. వంచేసిన మొసలి
Alligator Bending Fence నీళ్లలో ఉన్నప్పడు మొసలికి ఉండే శక్తే వేరు.. అని చెప్తుంటారు. కానీ.. ఈ మొసలి మాత్రం భూమిపైనా యమ స్ట్రాంగే! ఎంత స్ట్రాంగ్ అంటే.. ఫెన్సింగ్‌కు ఉన్న ఇనుప చువ్వలను సైతం వంచి.. అక్కడి నుంచి బయటపడేంత! ఫ్లారిడాలో కనిపించిన ఈ దృశ్యాన్ని ఒక ఔత్సాహికుడు ఫోన్‌లో బంధించి.. ఇంటర్‌నెట్‌లో పెట్టాడు. విధాత: మొసలి (Alligator) ఎదుటపడిందంటే వణికిపోవడం సహజం. అవి అంత క్రూరంగా ఉంటాయి మరి. పొరపాటున ఏ జీవి అయినా […]

Alligator Bending Fence
నీళ్లలో ఉన్నప్పడు మొసలికి ఉండే శక్తే వేరు.. అని చెప్తుంటారు. కానీ.. ఈ మొసలి మాత్రం భూమిపైనా యమ స్ట్రాంగే! ఎంత స్ట్రాంగ్ అంటే.. ఫెన్సింగ్‌కు ఉన్న ఇనుప చువ్వలను సైతం వంచి.. అక్కడి నుంచి బయటపడేంత! ఫ్లారిడాలో కనిపించిన ఈ దృశ్యాన్ని ఒక ఔత్సాహికుడు ఫోన్‌లో బంధించి.. ఇంటర్‌నెట్‌లో పెట్టాడు.
విధాత: మొసలి (Alligator) ఎదుటపడిందంటే వణికిపోవడం సహజం. అవి అంత క్రూరంగా ఉంటాయి మరి. పొరపాటున ఏ జీవి అయినా దొరికిపోతే అమాంతం నోట్లో వేసుకుని గుటుక్కుమనిపిస్తుంది. అలాంటి ఒక మొసలి.. వెరైటీ సాహసం చేసింది. ఫెన్సింగ్‌కు ఉన్న ఇనుప చువ్వలను ఈజీగా వంచేసి కంచె దాటి పోయిన మొసలి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తున్నది.
అమెరికాలోని ఫ్లారిడా (Florida)లో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ క్లిప్‌లో ఒక భారీ మొసలి (Huge Alligator) ఫెన్సింగ్‌ను దాటేందుకు దాని చువ్వలను వంచేసి (Bending Fence) ఎంచక్కా వెళ్లిపోయింది. అంత సులభంగా ఇనుప చువ్వలను వంచేయటాన్ని చూసి నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భయానక దృశ్యాలు ఫ్లారిడాలో మాత్రమే కనిపిస్తాయని పలువురు కామెంట్లు పెట్టారు.