హుస్సేన్‌ సాగర్‌: ఏప్రిల్‌ 14న అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్కరణ

విధాత‌: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజున హుస్సేన్‌ సాగర్‌ తీరాన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారని మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. మంత్రులు అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విగ్రహ పనులను ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌పై సీఎం కేసీఆర్‌కు […]

  • By: krs    latest    Nov 28, 2022 5:28 PM IST
హుస్సేన్‌ సాగర్‌: ఏప్రిల్‌ 14న అంబేద్క‌ర్ విగ్ర‌హావిష్కరణ

విధాత‌: వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతి రోజున హుస్సేన్‌ సాగర్‌ తీరాన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారని మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. మంత్రులు అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

విగ్రహ పనులను ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌పై సీఎం కేసీఆర్‌కు అపారమైన గౌరవం ఉన్నదన్నారు.

అంబేద్కర్‌ సూచించిన మార్గంలోనే తెలంగాణ ఉద్యమం నడిచిందని, వారు పొందుపరిచిన ఆర్టికల్‌ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంద‌న్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే ఈ దేశ ప్రగతికి మూలమని అంబేద్కర్‌ భావించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ జ‌న‌రంజకంగా పాలన సాగిస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.