హాట్ ఫొటోలతో.. సోషల్ మీడియా బూజు దులుపుతున్న పవన్ హీరోయిన్!
విధాత: నేటి రోజుల్లో హీరోయిన్లకి నటన కంటే అదృష్టం, గ్లామర్ షో, అందాల విందు ముఖ్యంగా మారాయి. నిన్న మొన్నటి వరకు ముంబయ్ భామలు తమ గ్లామర్ షోతో వెండితెరను ఏలారు. మేం చేసిందే యాక్టింగ్ మేం చూపిందే గ్లామర్ అన్న రీతిలో ఉండేది. యూత్ కూడా దానికే అలవాటు పడి పోయారు. అయితే ఇప్పుడు సోషల్ ట్రెండ్ నడుస్తుండడంతో తెలుగు హీరోయిన్లు కూడా మేమేం తక్కువ కాదంటూ దూసుకు వస్తున్నారు. తమ అందాల విందుతో ప్రేక్షకులకు […]

విధాత: నేటి రోజుల్లో హీరోయిన్లకి నటన కంటే అదృష్టం, గ్లామర్ షో, అందాల విందు ముఖ్యంగా మారాయి. నిన్న మొన్నటి వరకు ముంబయ్ భామలు తమ గ్లామర్ షోతో వెండితెరను ఏలారు. మేం చేసిందే యాక్టింగ్ మేం చూపిందే గ్లామర్ అన్న రీతిలో ఉండేది. యూత్ కూడా దానికే అలవాటు పడి పోయారు. అయితే ఇప్పుడు సోషల్ ట్రెండ్ నడుస్తుండడంతో తెలుగు హీరోయిన్లు కూడా మేమేం తక్కువ కాదంటూ దూసుకు వస్తున్నారు. తమ అందాల విందుతో ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు.
దాంతో టాలీవుడ్‌లోను బోల్డ్ హీరోయిన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. పరభాషా భామల కంటే మేం ఎందులోను తక్కువ కాదంటూ తమ గ్లామర్ షోలతో రెచ్చిపోతున్నారు. నిత్యం ఎవరోఒకరు బోల్డ్ ఫోటో షూట్‌లు చేస్తు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు.
తాజాగా ఇదే కోవలోకి తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా వచ్చి చేరింది. ఆ మధ్య ప్రియదర్శి హీరోగా చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథగా రూపొందిన చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ఎంతో పేరు వచ్చినా కమర్షియల్‌గా మాత్రం మెప్పించలేకపోయింది.
తెలంగాణ సత్తుపల్లికి చెందిన అనన్య తన మొదటి షార్ట్ ఫిలిం షాదీతో గుర్తింపు పొందింది. అది విమర్శకుల ప్రశంసలందుకుంది. సైమాకు సైతం నామినేట్ అయింది. అనంతరం 2019లో మల్లేశం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత ప్లేబ్యాక్ చిత్రంలో నటించింది.
ఆ తర్వాత అనూహ్యంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో ప్రధాన పాత్ర దక్కించుకుంది. పింక్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్ర కథ ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అంజలి, నివేదా, అనన్య ఆ మూడు పాత్రలో చేశారు. సినిమా హిట్ కావడంతో అనన్య ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కానీ ఆఫర్స్ అశించినంతగా సంపాదించలేక పోయింది.
ప్రస్తుతం శాకుంతలం, బూట్‌కట్ బాలరాజు చిత్రాలు, తహిళంలో ఓ చిత్రం ఆమె చేతిలో ఉన్నాయి. శాకుంతలంలో సమంత చెలికత్తెగా కనిపించనుంది. బూట్ కట్ బాలరాజు మూవీలో బిగ్ బాస్ షో సోహెల్ హీరోగా నటిస్తున్నాడు. అడపాదడపా ఓ మోస్తరు ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసే అనన్య ఉన్నట్టుండి జాకెట్ లేకుండా పైటతో ఎద అందాలు దాచుకుంటూ చేసిన బోల్డ్ ఫోటోషూట్ కుర్రకారు మతులు పొగొట్టేలా చేసింది.
నాభి, నడుము చూపిస్తూ కసిగా చూస్తున్నట్లు ఉన్న అ ఫొటోషూట్‌ను చూసిన వారంతా అబ్బా.. ఇంతందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావే అంటూ కొందరు నోర్లు చప్పరిస్తుంటే.. ఇదేం తెగింపురా బాబోయ్ అంటూ మరి కొందరు వయసు మళ్లిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
ఆమె లేటెస్ట్ ఫోటోస్ కొందరు క్రేజీ కామెంట్స్‌తో విరుచుకు పడుతున్నారు. ఆమధ్య ఓ నిర్మాత కుమారుడితో అనన్య ఎఫైర్ నడుపుతుందంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించింది. ఆ నిర్మాత కొడుకు ఎవరో నాకు చెప్పండి అంటూ చురకలు అటించింది. మీరు ఆ ఫొటోషూట్‌పై ఓ లుక్కేయండి మరి..