Anasuya | అనసూయా.. చంపేస్తావా ఏంటి? నెట్టింట రోజూ ఏదో మంట పెట్టాల్సిందేనా!

Anasuya విధాత‌: అవకాశాల కోసం ఆరాటమో.. ట్రోల్స్‌తో నెట్టింట వైరల్ కావడం క్రేజ్ తెచ్చిపెడుతుందని బలంగా నమ్ముతుందో తెలియదు కానీ తన గ్లామరస్ వీడియోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసి కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది హాట్ బ్యూటీ, యాంకర్ కమ్ నటి అనసూయ. ఏ భామ రోజూ ఏదో విధంగా నెట్టింట మంట పెడుతూనే ఉంది. ఆమె వీడియోలు, ఫోటోలకు వచ్చే కామెంట్స్ సైతం మరీ నాటుగా ఉండటం చూసి కూడా ఎక్కడా తగ్గడం లేదు అనసూయ. […]

Anasuya | అనసూయా.. చంపేస్తావా ఏంటి? నెట్టింట రోజూ ఏదో మంట పెట్టాల్సిందేనా!

Anasuya

విధాత‌: అవకాశాల కోసం ఆరాటమో.. ట్రోల్స్‌తో నెట్టింట వైరల్ కావడం క్రేజ్ తెచ్చిపెడుతుందని బలంగా నమ్ముతుందో తెలియదు కానీ తన గ్లామరస్ వీడియోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసి కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది హాట్ బ్యూటీ, యాంకర్ కమ్ నటి అనసూయ. ఏ భామ రోజూ ఏదో విధంగా నెట్టింట మంట పెడుతూనే ఉంది. ఆమె వీడియోలు, ఫోటోలకు వచ్చే కామెంట్స్ సైతం మరీ నాటుగా ఉండటం చూసి కూడా ఎక్కడా తగ్గడం లేదు అనసూయ.

భర్తతో నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసే కాపురాన్ని బజారులోకి తెచ్చి నెట్టింట్లో కాపురం పెట్టేసిందని, వయసు పెరుగుతున్న కొద్దీ రోజు రోజుకీ బరి తెగించేసిందనే కామెంట్స్ వస్తున్నా.. కాలు దువ్వి మరీ రెచ్చ గొడుతోంది. అస్సలు ఇంచు అంటే ఇంచు కూడా ఎక్కడా తగ్గడంలేదీ అమ్మడు. పైగా ‘‘నా భర్తను నేను ముద్దు పెట్టుకుంటే మీకేంటని’’ రివర్స్‌లో కామెంట్స్ చేస్తూ, వీడియోలలో రిఫ్లయ్‌లు ఇస్తూ ఇంకా రచ్చ చేసుకుంటుంది. ఇదంతా ఎందుకోసమో కూడా అర్థం కాకుండా ఉంది.


ఇలా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి నాలుగు అవకాశాలు రప్పించుకుందామనే.. ఇలా చేస్తుందా? అనే అనుమానాలు ఉన్నా.. ప్రస్తుతం అనసూయ కెరీర్‌కి ఏం ఢోకా లేదు. అయితే వెండితెర.. లేదంటే బుల్లి తెర అనే అస్త్రాలు.. యూత్‌ని కవ్వించే అందం ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగానే ఉంది. కాస్త జోరు తగ్గిందనగానే ఇలా ఏదో ఫోటోనో, వీడియోనో పెట్టి మళ్లీ వైరల్ అవుతుంది. తన ఫోజులతో కుర్రకారును కవ్వించి, కిక్కెక్కించి మరీ రెచ్చగొడుతూ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇదేం ఆనందమో, ఇదేం స్ట్రాటజీనో అర్థం కాక కుర్రాళ్ళు ఈ ఆంటీ వెనక ఫాలో అవుతున్నారు.

తాజాగా అనసూయ పెట్టిన ఓ వీడియోకైతే మరీ ఘోరంగా కామెంట్స్ చేస్తున్నారు. కాళ్లు ఎత్తెత్తి వేస్తూ.. మీ కోసమే ఇదంతా అనేలా ఆమె ఒలికిస్తున్న పరువాలకి ఫ్లాటైపోతున్నారు. అమ్మడుపై కవిత్వాలు అల్లేస్తున్నారు. అయినా నెటిజన్లని అనడానికి ఏముందిలే కానీ.. అన్ని విధాలా పేరు, సంపాదన ఉన్న వారు అణిగి మణిగి ఉంటే, అనసూయ మాత్రం తెగ హొయలు పోతూ ఎందుకు జనాల్ని రెచ్చగొడుతుందో మరి. అందుకే అన్నారు అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందని, ఏమీ లేని ఆకే ఇలా ఎగిరెగిరి పడుతుందని.. కాదంటారా.