నాగబాబుతో ఎలాంటి విభేదాలు లేవు: రోజా

విధాత: తెలుగులో ఈటీవీ పేరును మారుమోగించిన షో అంటే ‘జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అని చెప్పా. ఈ రెండు షోలతో కొత్త ట్రెండును సృష్టించిన ఘనత ఈటీవీతో పాటు నాగబాబు, రోజా, అనసూయ, రేష్మి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్లకు చెందుతుంది. వీరందరికంటే ఈ షో సూప‌ర్ హిట్ కావడంలో నాగబాబు, రోజాలది పై చేయి. వాళ్ళిద్దరూ ఈ షో కి జడ్జిలుగా వ్యవహరించి రక్తి కట్టించారు. 2014 నుంచి ప్రసారం అవుతున్న ఈ […]

  • By: krs    latest    Dec 27, 2022 6:10 AM IST
నాగబాబుతో ఎలాంటి విభేదాలు లేవు: రోజా

విధాత: తెలుగులో ఈటీవీ పేరును మారుమోగించిన షో అంటే ‘జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్’ అని చెప్పా. ఈ రెండు షోలతో కొత్త ట్రెండును సృష్టించిన ఘనత ఈటీవీతో పాటు నాగబాబు, రోజా, అనసూయ, రేష్మి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్లకు చెందుతుంది. వీరందరికంటే ఈ షో సూప‌ర్ హిట్ కావడంలో నాగబాబు, రోజాలది పై చేయి. వాళ్ళిద్దరూ ఈ షో కి జడ్జిలుగా వ్యవహరించి రక్తి కట్టించారు.

2014 నుంచి ప్రసారం అవుతున్న ఈ బుల్లితెర కామెడీ షో ఏ స్థాయిలో అందరికీ ప్రత్యేకంగా నచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మంచి రేటింగ్ సొంతం చేసుకుంటున్న షో లలో ఇది ఒకటి. అయితే ఈ షో నుంచి నాగబాబు జడ్జిగా నిష్క్రమించాడు. దాంతో నాగబాబు కేవలం రోజా వ‌ల్ల‌నే హర్ట్ అయ్యి జబర్దస్త్ షోకు దూర‌మయ్యాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్ల గురించి తాజాగా రోజా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు నాగబాబుతో ఎలాంటి విభేదాలు లేవు. చాలా సందర్భాలలో ఆయన నన్ను ఎంతో పొగిడారు. నేను ఏ మాత్రం నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెట్టని హీరోయిన్ అని ఆయన నన్ను గౌరవించారు. నాగబాబు విషయంలో నేను గౌరవంగానే ఉంటాను. జబర్దస్త్‌కు నాగబాబు దూరం కావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు రోజా.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. వైసీపీని వీడాల్సి వస్తే రాజకీయాలకే దూరమవుతానని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల‌కు దూరంగా ఉన్న రోజా.. రాబోయే రోజుల్లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. రోజా రాజకీయాల్లో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది.

రోజా అటు రాజకీయాల్లోనూ ఇది సినిమాల్లోనూ సక్సెస్ అయిన ఘనతను సాధించింది. అయితే జబర్దస్త్ షో కి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తూనే రోజా, నాగబాబులు పలుసార్లు ఒకరిపై ఒకళ్ళు సెటైర్లు వేసుకొని ఒకరిని ఒకరు విమర్శించుకున్న సంగతి తెలిసిందే. కానీ షోలో మాత్రం ఇద్దరూ కలిసికట్టుగానే ఉన్నారు. మరి ఈ విషయంలో నాగబాబు స్పందన ఏంటో తెలియాల్సి ఉంది!