చాలా మంది భర్తలు తమ భార్యలకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తారు. అంతేకాదు.. తమ ప్రియురాళ్లను షికార్లకు తీసుకెళ్తుంటారు
విధాత: చాలా మంది భర్తలు తమ భార్యలకు తెలియకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తారు. అంతేకాదు.. తమ ప్రియురాళ్లను షికార్లకు తీసుకెళ్తుంటారు. వారు ఏది కోరిన కాదనకుండా ఇప్పిస్తారు. అంతటి ప్రేమ కురిపిస్తారు ప్రియురాళ్లపై మగాళ్లు. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాలు బెడిసికొడుతాయి. అంతేకాదు.. రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుబడుతారు పెళ్లాలకు భర్తలు.
ఓ వ్యక్తి తన భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో భర్తపై నిఘా పెట్టింది. ఇటీవలే అతను ఓ షాపింగ్ మాల్లో ప్రియురాలితో కలిసి ఉన్నాడు. గమనించిన భార్య.. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇంకేముంది భర్త చెంప ఛెల్లుమనిపించింది భార్య. అంతటితో ఆగకుండా.. అక్కడ్నుంచి వెళ్తూ.. భర్త ప్రియురాలి జుట్టు పట్టి లాగి, కింద పడేసింది. ఆ తర్వాత భర్త ప్రియురాలిని తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. ఈ తతంగాన్ని అంతా ఓ యువకుడు తన కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ ఘటన ఏ పట్టణంలో జరిగిందనేది తెలియరాలేదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.