చంద్రబాబుపై మరో కేసు నమోదు

విధాత : మద్యం కంపనీలకు అనుమతులలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడుపై ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా ఆయన పేరును చేర్చించింది. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు 51రోజులుగా జైలులో ఉన్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అమరావతి భూముల కుంభకోణం కేసు, ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు అల్లర్ల కేసు, ఫైబర్ నెట్, స్కిల్ డివలప్‌మెంట్ కేసులను చంద్రబాబుపై పెట్టారు. ఇప్పుడు మద్యం కంపనీలకు అక్రమ అనుమతులు కేసూలో బాబు పేరు చేర్చారు. చంద్రబాబుపై వరుస కేసుల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం, సీఐడీలు అనుసరిస్తున్న తీరును ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది. సీఎం జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు వైఖరికి ఈ అక్రమ కేసులే నిదర్శమనంటూ ఆరోపిస్తుంది