Odisha | ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్
విధాత: ఒడిశా (Odisha)లో జరిగిన భారీ రైలు ప్రమాదాన్ని మర్చిపోకముందే అదే రాష్ట్రంలో మరో రైలు పట్టాలు తప్పింది. ప్రమాదానికి గురయింది గూడ్స్ రైలని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇక్కడి బార్గా జిల్లాలోని మెందాపలి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బార్గఢ్ నుంచి దుంగురీకి ఈ రైలు లైంస్టోన్ ఖనిజాన్ని రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొన్న బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది […]

విధాత: ఒడిశా (Odisha)లో జరిగిన భారీ రైలు ప్రమాదాన్ని మర్చిపోకముందే అదే రాష్ట్రంలో మరో రైలు పట్టాలు తప్పింది. ప్రమాదానికి గురయింది గూడ్స్ రైలని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇక్కడి బార్గా జిల్లాలోని మెందాపలి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బార్గఢ్ నుంచి దుంగురీకి ఈ రైలు లైంస్టోన్ ఖనిజాన్ని రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కొన్న బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
మూడు రోజుల క్రితం బాలేశ్వర్ లో కోరమాండల్ ఉదంతంలో ఇప్పటి వరకు 275 మంది మరణించగా.. 1100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. సిగ్నలింగ్‌లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
ఈ ప్రమాదానికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. వేగానికి ప్రాధాన్యం ఇచ్చి భద్రతను గాలికొదిలేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని రైల్వే భద్రతా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.