సౌత్ ఇండస్ట్రీపై నోరు పారేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్
కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? విధాత: పాన్ ఇండియా రూపంలో దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌తో పాటు అన్ని భాషలను చుట్టేస్తూ సంచలన విజయాలను, అద్భుత కలెక్షన్లను రాబడుతుంటే.. కొందరు బాలీవుడ్ దర్శక హీరోల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. ఈ పరిణామం బాలీవుడ్ ఊహించనిది. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే దశ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాం. ఒకనాడు తెలుగు చిత్రాలంటే కోలీవుడ్ చిత్రాలని అభిప్రాయమే ఉండేది. ఇక కన్నడ చిత్రాలంటే […]

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?
విధాత: పాన్ ఇండియా రూపంలో దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌తో పాటు అన్ని భాషలను చుట్టేస్తూ సంచలన విజయాలను, అద్భుత కలెక్షన్లను రాబడుతుంటే.. కొందరు బాలీవుడ్ దర్శక హీరోల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. ఈ పరిణామం బాలీవుడ్ ఊహించనిది. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే దశ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాం. ఒకనాడు తెలుగు చిత్రాలంటే కోలీవుడ్ చిత్రాలని అభిప్రాయమే ఉండేది. ఇక కన్నడ చిత్రాలంటే మరీ చిన్నచూపు.. ఉన్నంతలో కాస్త న్యాచురల్‌గా తీసే మలయాళ చిత్రాలపై ప్రశంసలు కురిపించేవారు.. బాలీవుడ్‌లో రీమేక్ చేసేవారు.
కోలీవుడ్ అంటే మాత్రం కాస్త గౌరవం ఉంది.. అందుకే మొదట్లో రజినీకాంత్, కమలహాసన్, విక్రమ్ వంటి వారికి కూడా బాలీవుడ్‌లో మంచి అవకాశాలు లభించాయి. రెండు మూడు చిత్రాలు ఆదరించి ఆ తర్వాత ఆ కారణంగా ఒకటి రెండు ఫ్లాపులు రాగానే వారిని తిరిగి కోలీవుడ్‌కు వెళ్ళగొట్టారు. ఇక చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల పరిస్థితి కూడా అదే.
సోలో హీరోగా వాళ్లను అణగదొక్కారు.. దాంతో నాలుగై సినిమాలు చూసి వారు కూడా తమ భాషలకు వచ్చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. ప్రాంతీయ చిత్రాలు మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలలో నటిస్తే తమకున్న మార్కెట్ మరింత పెరుగుతుందని బాలీవుడ్ టాప్ హీరోలు సైతం ఇక్కడ నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అమితాబ్ నుంచి సంజయ్ దత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సల్మాన్ ఖాన్ వరకు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇక రాబోయే రోజుల్లో భారతీయ సినీ చిత్రం మరింత మారుతుంది.. ఎందుకంటే మైక్ టైసన్ వంటి నెంబర్ వన్ బాక్సింగ్ వీరుడు తెలుగు కోసం వచ్చి ‘లైగర్’ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తూ ‘ప్రాజెక్ట్ K’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో అమితాబ్, దీపికా పడుకొనే.. ఇలా ప్రముఖ తారాగణం నటిస్తోంది.
ఇక విషయానికి వస్తే ఇంతకాలం భారతీయ సినిమా అంటే తమదే అని జబ్బులు జరుచుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఈ పరిణామాలను జీర్ణించు కోలేకపోతున్నారు బాలీవుడ్‌ను శాసిస్తున్న నిర్మాతలు, హీరోలు దక్షిణాది దర్శకుల, హీరోల వద్ద సినిమాల కోసం క్యూ కడుతున్నారు. ఇది అక్కడి దర్శకులకు కొందరు నిర్మాతలకు హీరోలకు మింగుడు పడటం లేదు. అందుకే పాన్ ఇండియా చిత్రాలపై విషం కక్కుతున్నారు.. వాటిని చులకన చేస్తూ తమ నోటికొచ్చింది వాగుతున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తుంటే నిర్మాతలు సిద్ధంగా ఉంటే మధ్యలో వీరికి ఏమి నొప్పి అనేది అర్థం కావడం లేదు.
ఏడాది కాలంగా సౌత్ ఇండియాకు చెందిన పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీయఫ్, కాంతార, కార్తికేయ వంటి చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేశాయి. అదే సమయంలో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్, రన్వీర్ సింగ్, రణబీర్ కపూర్ వంటి వారంతా చాప చుట్టేశారు. ఈ పరిణామాలు బాలీవుడ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది.. కానీ మారుతున్న పరిణామాలను సౌత్ నుంచి వస్తున్న టాలెంటును కొందరు అంగీకరిస్తుంటే, కొందరు మాత్రం ఆ గొప్పతనాన్ని అంగీకరించలేకపోతున్నారు.. తమ చిన్న బుద్ధిని చూపిస్తున్నారు.
బాహుబలి సిరీస్ విజయం గాలివాటమే అని ఎద్దేవా చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు.. ప్రస్తుత విజయాలతో నోరుమూశారు. కానీ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడైన అనురాగ్ కశ్యప్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌కు కావాల్సింది ‘పుష్ప’, ‘కాంతార’, కేజీయఫ్ వంటి కథలు కాదన్నారు. వాటిని ఊహించుకుని సినిమాలు చేస్తే బాలీవుడ్ మరింత నష్టపోతుందని హెచ్చరించారు. కొత్త కథలు రావాలి.. సరికొత్త కంటెంట్ ప్రేక్షకుడికి ఇవ్వగలగాలి. సౌత్ ఇండియా నుంచి వస్తుంది కేవలం మాస్ యాక్షన్ కథలే.
ఇలాంటి కథలతో ఎల్లకాలం నెట్టుకు రాలేరు. సౌత్, నార్త్ నేటివిటీకి, ప్రజలకు చాలా వ్యత్యాసం ఉంది. రెండు ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచులు కూడా వేరు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి యూనివర్సల్ టచ్ ఉన్న కథలు సక్సెస్ అయ్యాయంటే అర్థం ఉంది. కానీ, ‘పుష్ప’, ‘కాంతార’ చిత్రాలు ఒక ప్రాంతానికి చెందిన కథలు అవి బాలీవుడ్‌లో విజయం సాధించడం మేకర్స్‌ని అయోమయంలోకి నెట్టేస్తుంది.. అంటూ కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉండగా.. ‘కాంతార’ చిత్రంపై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే.
Learnt so much by watching #Kantara. The power of @shetty_rishab’s conviction makes the film extraordinary. Top notch storytelling, direction & acting. The peak climax transformation gave me goosebumps