AP: జగన్ మీద తెలుగు మహిళల అభిమానం.. స్టిక్కర్ చింపిన కుక్కపై పోలీసులకు ఫిర్యాదు
విధాత: అదేంటి బద్ధ శత్రువు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద తెలుగు మహిళలు , అంటే తెలుగుదేశం మహిళా కార్యకర్తలు అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు.. ఏమైంది.. అనుకుంటున్నారా… అదే ఏపీ పాలిటిక్స్ లోని ప్రత్యేకం.. రకరకాల వ్యంగ్యాలు, వెటకారాల కలబోతగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొన్న జగనన్న మా భవిష్యత్ పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా ఇంటింటికి జగనన్న మా భవిష్యత్ అంటూ […]

విధాత: అదేంటి బద్ధ శత్రువు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద తెలుగు మహిళలు , అంటే తెలుగుదేశం మహిళా కార్యకర్తలు అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు.. ఏమైంది.. అనుకుంటున్నారా… అదే ఏపీ పాలిటిక్స్ లోని ప్రత్యేకం.. రకరకాల వ్యంగ్యాలు, వెటకారాల కలబోతగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొన్న జగనన్న మా భవిష్యత్ పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించింది.
అందులో భాగంగా ఇంటింటికి జగనన్న మా భవిష్యత్ అంటూ స్టిక్కర్లు అతికించారు. అయితే ఈ స్టిక్కర్ల కార్యక్రమాన్ని టిడిపి వ్యతిరేకిస్తోంది. ఇదిలా ఉండగా రెండ్రోజుల క్రిందట ఓ కుక్క జగన్ మోహన్ రెడ్డి స్టిక్కరును చించేస్తున్న వీడియో తెగ చక్కెర్లు కొట్టింది. ఈ విషయం మీద బాధపడిపోయిన తెలుగు మహిళలు కొందరు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాదాపు నాలుగు కోట్ల మందికి అభిమానపాత్రుడైన ముఖ్య మంత్రి గారి పోస్టర్ మీద కుక్క దాడి చేసి చించేస్తే ఎలా.? ఇది మనకు అవమానం కదా.. ఎంతటి చిన్నతనం, మాకు చాల బాధగా ఉంది.. కాబట్టి ఆ కుక్క మీద కేసు పెట్టి దానిమీద చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా పాపం పోలీసుకు సైతం ఫిర్యాదు తీసుకుని రసీదు సైతం ఇచ్చారు.
మొత్తానికి టీడీపీ వైసిపి మధ్య పోస్టర్ల వార్ గట్టిగానే మొదలైంది. ఇదిలా ఉండగా ఈ స్టిక్కర్లు ఇళ్లకు అంటిస్తున్న వాలంటీర్లు మీద పోలీస్ కేసులు పెడతామని టిడిపి బెదిరిస్తోంది. పబ్లిక్ స్థలాలు, భవనాల మీద ఇలా స్టిక్కర్లు అంటించకుండా ఉండేలా గతంలో ఓ చట్టం ఉందని, దాన్ని ధిక్కరిస్తే పోలీస్ కేసులు పెడతామని టిడిపి అంటోంది.
ఈమేరకు పార్టీ ధినాయకత్వం జిల్లాలకు సూచనలు పంపిందని, స్టిక్కర్లు అతికిస్తున్న వలంటీర్ల ఫోటోలు తీసి వాటిని సిద్ధం చేయాలనీ చెప్పిందట. అవసరం అయినపుడు తమ క్యాడర్ తో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టిడిపి రెడీగా ఉంది.