DGP తెలంగాణకా.. ఏపీకా: నేడు తేలనున్న అధికారుల భవితవ్యం!

విధాత: ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం నేడు (శుక్రవారం) తేలనున్నది. 9 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇవ్వనున్నది. వారం రోజుల కిందట సోమేశ్‌కుమార్‌ తెలంగాణలో కొనసాగింపును కొట్టివేసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించడం ఆయన అక్కడ రిపోర్టు చేయడం జరిగిపోయాయి. అదే సమయంలో తెలంగాణలో కొనసాగుతున్న డీపీజీ అంజనీ కుమార్‌, ఐఎస్‌ఎస్‌ అధికారులు వాణీ ప్రసాద్‌, వాకాటి కరుణ, రోనాల్డ్‌రాస్‌, అమ్రపాలి తదితరులు […]

  • By: krs    latest    Jan 19, 2023 5:36 PM IST
DGP తెలంగాణకా.. ఏపీకా: నేడు తేలనున్న అధికారుల భవితవ్యం!

విధాత: ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం నేడు (శుక్రవారం) తేలనున్నది. 9 మంది ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల క్యాడర్ అలాట్మెంట్‌పై నేడు తెలంగాణ హైకోర్ట్ తీర్పు ఇవ్వనున్నది.

వారం రోజుల కిందట సోమేశ్‌కుమార్‌ తెలంగాణలో కొనసాగింపును కొట్టివేసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించడం ఆయన అక్కడ రిపోర్టు చేయడం జరిగిపోయాయి.

అదే సమయంలో తెలంగాణలో కొనసాగుతున్న డీపీజీ అంజనీ కుమార్‌, ఐఎస్‌ఎస్‌ అధికారులు వాణీ ప్రసాద్‌, వాకాటి కరుణ, రోనాల్డ్‌రాస్‌, అమ్రపాలి తదితరులు భవితవ్యంపై గురించి చర్చ జరిగింది. వీరు తెలంగాణలో కొనసాగుతారా? ఏపీ వెళ్తారా అన్నది హైకోర్టు తేల్చనున్నది.