BC Gurukula | BC గురుకులాల్లో.. ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్, డిగ్రీలకు ఈ నెల 16 6,7,8 తరగతులకు ఈ నెల 20వ తేదీలోగా ఆన్‌లైన్లో ద‌రఖాస్తులు విధాత: బీసీ గురుకుల(BC Gurukula) పాఠశాలల్లో 6,7,8 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ కోర్సులలో ఉన్న ఖాళీ సీట్లలో ప్రవేశానికి బీసీ సంక్షేశాఖకు చెందిన మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుదారులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇంటర్, డిగ్రీ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోగా, 6,7,8 తరగతులో చేరాలనుకునే […]

  • By: Somu    latest    Apr 06, 2023 12:58 PM IST
BC Gurukula | BC గురుకులాల్లో.. ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
  • ఇంటర్, డిగ్రీలకు ఈ నెల 16
  • 6,7,8 తరగతులకు ఈ నెల 20వ తేదీలోగా
  • ఆన్‌లైన్లో ద‌రఖాస్తులు

విధాత: బీసీ గురుకుల(BC Gurukula) పాఠశాలల్లో 6,7,8 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ కోర్సులలో ఉన్న ఖాళీ సీట్లలో ప్రవేశానికి బీసీ సంక్షేశాఖకు చెందిన మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుదారులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ఇంటర్, డిగ్రీ కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోగా, 6,7,8 తరగతులో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోగా http://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా.. 6,7,8 తరగతులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష మే 10వ తేదీన నిర్వహిస్తారు. హాల్ టికెట్లను మే 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఇంటర్, డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తలు చేసుకున్న వారికి ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష‌ నిర్వహిస్తామని, 20వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఆగస్టు 31వ తేదీ నాటికి అన్ని తరగతుల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. అదనపు వివరాలకు 040 23328266, 040 23322377 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.