AR CI | 2 వేల నోట్ల దందాలో ఏఆర్ సీఐ స్వర్ణలతపై.. కేసు నమోదు
AR CI విధాత: 2 వేల రూపాయల నోట్ల మార్పిడి దందాలో నాయకత్వం వహిస్తున్న ఏఆర్ సీఐ స్వర్ణలత వ్వవహారంపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. 90లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్లను మోసం చేసిన ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించింది. స్వర్ణలతతో పాటు బ్రోకర్ సూరి సహా నోట్ల మార్పిడి కేసులో నలుగురు పై పోలీసులు కేసు నమోదు చేశారు. 90 […]

AR CI
విధాత: 2 వేల రూపాయల నోట్ల మార్పిడి దందాలో నాయకత్వం వహిస్తున్న ఏఆర్ సీఐ స్వర్ణలత వ్వవహారంపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. 90లక్షల 500 నోట్లు ఇస్తే కోటి రూపాయల 2000 నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవీ ఆఫీసర్లను మోసం చేసిన ముఠాకు ఏఆర్ సీఐ స్వర్ణలత నాయకత్వం వహించింది.
స్వర్ణలతతో పాటు బ్రోకర్ సూరి సహా నోట్ల మార్పిడి కేసులో నలుగురు పై పోలీసులు కేసు నమోదు చేశారు. 90 లక్షలలో 15 లక్షలు స్వర్ణలత నొక్కేసింది. తన సిబ్బంది చేత బాధితులను బెదిరించి కొట్టి పంపేసింది. స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా కూడా వ్వవహరిస్తుంది.