Bread Crumbing | మీరూ బ్రెడ్ క్రంబింగ్ బాధితులేనా? అంటే ఏంటో చూడండి..
Bread Crumbing | విధాత: మీరు వైవాహిక లేదా ప్రేమ బంధంలో ఉన్నారనుకుందాం. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పోలిస్తే.. మీ భాగస్వామి నుంచి వచ్చే స్పందన తక్కువగా ఉంటే మీరు బ్రెడ్ క్రంబింగ్ బాధితులని అర్థం. ఒక వ్యక్తి మనల్ని చిన్న చిన్న ట్రిక్స్‌తో బంధంలోకి తీసుకొచ్చి.. ఆ తర్వాత దానిని పట్టించుకోకుండా, బాధ్యతతో వ్యవహరించకుండా ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేస్తే దానిని బ్రెడ్ క్రంబింగ్ (Bread Crumbing) అని పిలుస్తారు. చిన్నగా తరిగిన […]

Bread Crumbing |
విధాత: మీరు వైవాహిక లేదా ప్రేమ బంధంలో ఉన్నారనుకుందాం. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పోలిస్తే.. మీ భాగస్వామి నుంచి వచ్చే స్పందన తక్కువగా ఉంటే మీరు బ్రెడ్ క్రంబింగ్ బాధితులని అర్థం. ఒక వ్యక్తి మనల్ని చిన్న చిన్న ట్రిక్స్‌తో బంధంలోకి తీసుకొచ్చి.. ఆ తర్వాత దానిని పట్టించుకోకుండా, బాధ్యతతో వ్యవహరించకుండా ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేస్తే దానిని బ్రెడ్ క్రంబింగ్ (Bread Crumbing) అని పిలుస్తారు.
చిన్నగా తరిగిన బ్రెడ్ ముక్కలు లాగే ఈ బంధానికీ స్థిరత్వం ఉండకపోవడంతో దీనిని ఆ పేరుతో పిలుస్తున్నారు. అభద్రతాభావం ఎక్కువగా ఉండటం, ఒంటరితనంతో బాధపడుతూ తాత్కాలిక సాంత్వన కోసం బంధాన్ని కోరుకోవడం, భావోద్వేగపరమైన పరిపక్వత లేకపోవడం వంటివి మనుషులను ఈ బ్రెడ్ క్రంబింగ్‌కు పాల్పడేలా ఉసిగొల్పుతాయి.
View this post on Instagram
బ్రెడ్ క్రంబింగ్ కోసం ప్రయత్నించేవారిలో నిజంగా బంధాన్ని దృఢంగా మార్చుకోవాలన్న ఆకాంక్ష ఉండదని, ఏదో భాగస్వామి మెప్పు కోసం చిన్న చిన్న ప్రయత్నాలు మాత్రం చేస్తారని మానసిక వైద్యురాలు సుసానే వోల్ఫ్ వెల్లడించారు. మీరు బ్రెడ్ క్రంబింగ్ బంధంలో ఉన్నారా లేదా అని చూడటానికి కొన్ని లక్షణాలను పేర్కొన్నారు. అవి కనుక మీ భాగస్వామిలో ఉంటే మీరు బ్రెడ్ క్రంబింగ్ బాధితులే.. అవి
- నిబద్ధత కొరవడడం: ఏదైనా చేయడానికి చాలా ఉత్సుకత చూపిస్తారు. కానీ దానికి కమిట్ అవ్వడానికి వాళ్లకు చాలా భయాలు అడ్డొస్తాయి. ఆఖరికి వారు చేతులెత్తేస్తారు.
- మిశ్రమ స్పందనలు: వారు మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడరు. అలాగే దానిని తెంచుకోలేరు. వారు ఇలా వేర్వేరు సందర్భాల్లో పలు విధాల స్పందనలు ఇచ్చి మిమ్మల్ని అయోమయ స్థితిలోకి నెడతారు. దీని వల్ల మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు.
- ఫోన్లు, మెసేజ్‌కు నో ఆన్సర్: బాధ్యతల విషయంలో వారు స్తబ్దుగా ఉంటారు. ఫోన్లను అవాయిడ్ చేస్తారు. మెసేజ్‌లకు ఎప్పుడోగానీ బదులు ఇవ్వరు.
- ప్రయత్నాలు నిల్: బంధాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రక్రియలో వెనకడుగు వేస్తారు. మీకు చిన్న చిన్న సంతోషాలు కలిగిస్తారు. కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోరు.
- ప్రత్యామ్నాయానికి ప్రయత్నం: మీతోనే ఉంటున్నా.. మీ కన్నా మెరుగైన వారి కోసం వారి కళ్లు చూస్తూనే ఉంటాయి. వారికి మీరొక ఆప్షన్ మాత్రమే.
- అస్థిరమైన భావోద్వేగాలు: ఒక్కోసారి మీరంటే ప్రాణం అంటారు. మరోసారి కొన్ని గంటలు, రోజుల పాటు మీ ఉనికినే గుర్తించారు. వారి భావోద్వేగాలు ఓ స్థాయిలో ఉండవు.
మీ భాగస్వామిలో ఇలాంటివి ఏమైనా లక్షణాలు గమనించారా.