వైఎస్ షర్మిల అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు
విధాత: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతిభవన్ ముట్టడి కోసం కారులో బయలుదేరిన ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. వాహనం దిగాలని పోలీసులు కోరినప్పటికీ ఆమె వినలేదు. దీంతో ధ్వంసమైన కారులో షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే పోలీసులు క్రేన్‌తో లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిపై వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ […]

విధాత: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతిభవన్ ముట్టడి కోసం కారులో బయలుదేరిన ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. వాహనం దిగాలని పోలీసులు కోరినప్పటికీ ఆమె వినలేదు.
దీంతో ధ్వంసమైన కారులో షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే పోలీసులు క్రేన్‌తో లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వైఖరిపై వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తల ఆందోళనలతో రాజ్‌భవన్‌రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది.