ప్రాజెక్ట్‌ K: ప్రభాస్‌కు.. అశ్వినీదత్ కండీషన్స్..!

విధాత‌: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ‌రుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ఆది పురుష్ చిత్రం షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు విఎఫ్ఎక్స్ పనులు నాణ్యతగా లేని కారణంగా మరో వంద కోట్లు కేటాయించి రిపేర్లు చేస్తున్నారు. ఈ మూవీ ఇదే ఏడాది విడుదల కానుంది. వీటితో పాటు ప్రభాస్ పాన్ వ‌ర‌ల్డ్ రేంజిలో ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని త్‌ నిర్మాణంలో ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో […]

  • By: krs    latest    Jan 27, 2023 2:50 AM IST
ప్రాజెక్ట్‌ K: ప్రభాస్‌కు.. అశ్వినీదత్ కండీషన్స్..!

విధాత‌: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ‌రుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ఆది పురుష్ చిత్రం షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు విఎఫ్ఎక్స్ పనులు నాణ్యతగా లేని కారణంగా మరో వంద కోట్లు కేటాయించి రిపేర్లు చేస్తున్నారు. ఈ మూవీ ఇదే ఏడాది విడుదల కానుంది. వీటితో పాటు ప్రభాస్ పాన్ వ‌ర‌ల్డ్ రేంజిలో ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని త్‌ నిర్మాణంలో ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్టు కే అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న అన్ని చిత్రాలలోకి అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అంటే ప్రాజెక్టు కే అనే చెప్పాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ లో కలకాలం గుర్తుండి పోయేలా క్రేజీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ మూవీని ఏకంగా 500 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌డుకొనే, దిశాప‌టానీ వంటి వారు కూడా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రభాస్ ప్రాజెక్టు కే కంటే ముందు మారుతితో తాను చేస్తున్న చిత్రాన్ని విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అతి తక్కువ బడ్జెట్లో వేగంగా చిత్రాలను తీసే మారుతి తో ప్రభాస్ హర్రర్ థ్రిల్ల‌ర్ కామెడీ చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. షూటింగ్ మాత్రం గుట్టు చ‌ప్పుడు కాకుండా వేగంగా కొన‌సాగుతోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఇది పాన్ ఇండియా చిత్రం కాదు. అయితే తమ ప్రాజెక్టు కే ముందు మారుతి చిత్రం విడుదలైతే అది తదుపరి విడుదలయ్యే తమ ప్రాజెక్టు kపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అశ్వినీదత్ భావిస్తున్నారు.

అందుకే ఆ చిత్రాన్ని ప్రాజెక్ట్ కె తర్వాతే విడుదల చేయాల‌ని ప్రభాస్‌కు కండిషన్ పెట్టాడట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ అశ్విని దత్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య చర్చలు సాగుతున్నాయట. మరి చివరికి ఎవరి మాట నెగ్గుతుందో వేచి చూడాలి.