తండాలో భూ వివాదం.. త‌మ్ముడి భార్య‌పై గొడ్డలితో దాడి

విధాత, ఉమ్మడి మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లాలో అన్నదమ్ముల మధ్య జరిగిన భూ వివాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో రెచ్చిపోయిన సోదరుడే గొడ్డలితో దాడి చేసిన ఘటన ధూళిమిట్ట మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ధూళిమిట్ట మండలం హనుమతండ గ్రామపంచాయతీ సిబి తండాకు చెందిన ధరావత్ దీప్లా, థావూరియా అన్నదమ్ములు. ఇందులో థావూరియాకు నాలుగు ఎకరాల భూమి, దీప్లాకు ఎకరంన్నర భూమి ఉంది. థావూరియా దివ్యాంగుడు అవడం చేత అన్న దీప్లా తమ్ముడుని పది లక్షలైనా లేదా […]

తండాలో భూ వివాదం.. త‌మ్ముడి భార్య‌పై గొడ్డలితో దాడి

విధాత, ఉమ్మడి మెదక్ బ్యూరో: సిద్ధిపేట జిల్లాలో అన్నదమ్ముల మధ్య జరిగిన భూ వివాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో రెచ్చిపోయిన సోదరుడే గొడ్డలితో దాడి చేసిన ఘటన ధూళిమిట్ట మండలంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ధూళిమిట్ట మండలం హనుమతండ గ్రామపంచాయతీ సిబి తండాకు చెందిన ధరావత్ దీప్లా, థావూరియా అన్నదమ్ములు. ఇందులో థావూరియాకు నాలుగు ఎకరాల భూమి, దీప్లాకు ఎకరంన్నర భూమి ఉంది. థావూరియా దివ్యాంగుడు అవడం చేత అన్న దీప్లా తమ్ముడుని పది లక్షలైనా లేదా ఎకరం భూమైనా ఇవ్వమని వేధింపులకు గురి చేసేవాడు.

అంతేకాకుండా నాకున్న రాజకీయ పలుకుబడితో నీ భూమిని మొత్తం కాజేస్తానని బెదిరించేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఉదయం థావూరియాపై గొడవకు దిగిన ధరావత్ ఇంట్లో ఉన్న గొడ్డలితో తమ్ముడి భార్య సునీతపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సునీతను ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాజు, పైలెట్ సతీష్ రెడ్డి 108 వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.