నల్లగొండ: బెటాలియన్ వద్ద స్వగృహ ప్లాట్లకు వేలం: కలెక్టర్
విధాత: నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లీ టౌన్‌షిప్‌లోని ఓపెన్ ప్లాట్లకు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఈ నెల 14 నుంచి 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. టౌన్‌షిప్‌లో ఉన్న సుమారు 400 ప్లాట్లకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఎంజీ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న […]

విధాత: నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ గ్రామంలోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లీ టౌన్‌షిప్‌లోని ఓపెన్ ప్లాట్లకు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఈ నెల 14 నుంచి 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు.
టౌన్‌షిప్‌లో ఉన్న సుమారు 400 ప్లాట్లకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ప్రత్యక్ష వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఎంజీ యూనివర్సిటీ ఎదురుగా ఉన్న శ్రీవల్లి టౌన్‌షిప్ రాజీవ్ స్వగృహా ఓపెన్ ప్లాట్లు (229), పాక్షిక నిర్మాణ గృహాలు (355) విక్రయానికి ప్రత్యక్ష వేలం విషయమై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన రెండవ ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
మధ్యతరగతి ఉద్యోగులు, ప్రజలకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు చాలా మంది రిటైర్ అయ్యే వరకు కూడా సొంత ఇల్లు లేని వారు ఉన్నారని, అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశమని, శ్రీవల్లి టౌన్ షిప్‌లో 100 గజాలు మొదలుకొని 609 గజాల వరకు ప్లాట్లు, 100 గజాల నుంచి 342 గజాల వరకు పాక్షిక నిర్మాణ గృహాలు ఉన్నాయని తెలిపారు.
నార్కట్ పల్లి – అద్దంకి రాష్ట్ర రహదారికి పక్కన,12 వ బెటాలియన్ దగ్గర, నల్గొండ ఐ.టీ.హబ్ నుంచి 6 కి.మీ, కామినేని మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నుంచి 8 కి.మీ, నల్గొండ పట్టణానికి 10 కి.మీ దూరంలో ఉందని, అందువల్ల పెద్ద ఎత్తున వేలం దారులు ప్రత్యక్ష వేలంలో పాల్గొని ఏలాంటి ఇబ్బందులు లేని ఫ్లాట్లను సొంతం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
శ్రీవల్లి టౌన్ షిప్‌లోని ప్లాట్లకు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఈ నెల 14 నుంచి 17 వరకు తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో ప్రత్యక్ష వేలం వేయనున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని ఉద్యోగులు, ప్రజలకు వివరించి అవగాహన కలిగించాలని ఎవరైనా ఆసక్తి ఉన్న వారు ప్రత్యక్షంగా ఈ ప్లాట్లను పరిశీలించుకోవచ్చని తెలిపారు.
ఈ ప్లాట్ల వేలం పాటలో పాల్గొనదలచే వారు జిల్లా కలెక్టర్ పేరు మీద రూ.10 వేల ఈఎండిని డీడీ రూపంలో చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, గృహ నిర్మాణ పి.డి .రాజ్ కుమార్, రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ మేనేజర్ షఫీ పాల్గొన్నారు.