అయోధ్య రామ మందిర్‌ రెడీ

అయోధ్య రామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నూతన రామాయలం ప్రారంభోత్సవం జనవరి 21నుంచి 24వరకు జరుగనుంది

అయోధ్య రామ మందిర్‌ రెడీ

విధాత : ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. నూతన రామాయలం ప్రారంభోత్సవం జనవరి 21నుంచి 24వరకు జరుగనుంది. గర్భగుడిలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న జరగనుంది. 26నుంచి భక్తులను అనుమతిస్తారు. దాదాపు 130 ఏళ్లకు పైగా కొనసాగిన రామజన్మభూమి-బాబ్రీమసీద్ వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోయింది.



 


వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించిన సుప్రీంకోర్టు, మసీదు నిర్మాణం కోసం ఐదెకరాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. మూడున్నరేళ్ల కిందట 2020 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది.

అయోధ్య లోని భవ్య రామమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహం పనులు 90వాతం పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు రాముడి విగ్రహం పూర్తవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భటోరియా తెలిపారు. మొత్తం మూడు రాముడి విగ్రహాలను వేర్వేరు చోట్ల శిల్పులు తయారు చేస్తున్నారు. వీటిలో అంత్యంత సుందరంగా ఉన్న విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. 51అంగుళాల ఎత్తుతో బాలుడి రూపంలో ఉండే రాముడు విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండేలా విగ్రహం తయారు చేస్తున్నారు.