చంద్రబాబు కుప్పంకు నాన్ లోకల్, హైద‌రాాబాద్‍కు లోకల్: సీఎం జగన్

విధాత‌: కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు నాన్ లోకల్ అని, ఆయన హైదరాబాద్‍కు మాత్రమే లోకల్ అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుప్పంలో వైస్సార్ చేయూత మూడో విడుత నిధుల విడుదల కార్యక్రమాన్ని కుప్పంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన కీలక ప్రకటనలు చేశారు. అనేకసార్లు కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపించిన ఇక్కడి అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, దోచుకో, దాచుకో, తీసుకో […]

  • By: Somu    latest    Sep 23, 2022 10:27 AM IST
చంద్రబాబు కుప్పంకు నాన్ లోకల్, హైద‌రాాబాద్‍కు లోకల్: సీఎం జగన్

విధాత‌: కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు నాన్ లోకల్ అని, ఆయన హైదరాబాద్‍కు మాత్రమే లోకల్ అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుప్పంలో వైస్సార్ చేయూత మూడో విడుత నిధుల విడుదల కార్యక్రమాన్ని కుప్పంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేశారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన కీలక ప్రకటనలు చేశారు. అనేకసార్లు కుప్పం ప్రజలు చంద్రబాబును గెలిపించిన ఇక్కడి అభివృద్ధికి చేసింది ఏమీ లేదని, దోచుకో, దాచుకో, తీసుకో అనే నినాదంతో పనిచేశాడని విమర్శించారు. కుప్పం అంటే చంద్రబాబు పరిపాలన కాదని.. కుప్పం అంటే ఎస్సీ, ఎస్టీ , బీసీల అభివృద్ధి అని సీఎం జగన్ అన్నారు.

కనీసం హంద్రీ నీవా కాలువ కూడా తవ్వలేని అసమర్ధుడు అన్నారు. కుప్పం రైతులకు కీలకమైన హంద్రీ నీవా బ్రాంచ్ కెనాల్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు కప్పంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. వాటి విలువ రూ. 66 కోట్లు. కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. కుప్పం అభివృద్ధికి రానున్న కాలంలో 400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సంక్షేమ పథకాల కోసమే అప్పులు చేస్తున్నామని జగన్ చెప్పారు.