Bachelors’ March | పెళ్లి కోసం 200 మంది బ్రహ్మచారుల పాదయాత్ర..! ఎక్కడో తెలుసా..?

Bachelors' March | పాదయాత్రల గురించి చాలా మందికి తెలిసిందే. ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు భక్తులు పుణ్య క్షేత్రాలకు పాద్రయాత్ర చేస్తూ వెళ్లిన సందర్భాలనూ చూశాం. కానీ, తొలిసారిగా పెళ్లి కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మీరు చదివేది నిజమే. ఈ యాత్ర జరుగుతుంది ఎక్కడో కాదు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని మండ్య జిల్లాలో. జిల్లాకు చెందిన దాదాపు 200 మంది యువకులు తమకు పెళ్లి కాకపోవడంతో ప్రముఖ […]

Bachelors’ March | పెళ్లి కోసం 200 మంది బ్రహ్మచారుల పాదయాత్ర..! ఎక్కడో తెలుసా..?

Bachelors’ March | పాదయాత్రల గురించి చాలా మందికి తెలిసిందే. ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం చూస్తూనే ఉన్నాం. కొందరు భక్తులు పుణ్య క్షేత్రాలకు పాద్రయాత్ర చేస్తూ వెళ్లిన సందర్భాలనూ చూశాం. కానీ, తొలిసారిగా పెళ్లి కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మీరు చదివేది నిజమే. ఈ యాత్ర జరుగుతుంది ఎక్కడో కాదు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని మండ్య జిల్లాలో. జిల్లాకు చెందిన దాదాపు 200 మంది యువకులు తమకు పెళ్లి కాకపోవడంతో ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవనబెట్టకు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలో ఉన్న ఆలయానికి ఈ నెల 23న పాదయాత్రగా బయలుదేరి వెళ్లనున్నారు.

మండ్య జిల్లా మద్దూరు తాలూకా కేఎం దొడ్డి పరిసర గ్రామాలకు చెందిన ఈ యువకులది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. దాదాపు యువకలందరికీ పెదకరాలకుపైగానే పొలాలున్నాయి. ఏడాదికి మూడు పంటలు సాగు చేస్తూ పెద్ద మొత్తంలోనే సంపాదిస్తున్నారు. అయినా పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం లేదు. స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా, ఇతర ప్రాంతాలవారు ఇక్కడకు ఆడపిల్లలను ఇవ్వకపోవడంతో సరైన వయసులో పెళ్లిళ్లు కావడం లేదని వాపోతున్నారు. ఇందులో 30 నుంచి 34 ఏళ్ల మధ్య వసున్నవారున్నారు. ఇక బ్రహ్మచారులు పాదయాత్రను ప్రకటించగానే.. బెంగళూరు, మైసూర్‌, మండ్య, శివమొగ్గ తదితర జిల్లాల నుంచి వంద పేర్లు నమోదు చేసుకున్నారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

కాగా, యాత్రకు సంబంధించిన ఖర్చులను పాల్గొనే వారు సమానంగా భరించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా.. గతంలో మండ్య జిల్లాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని, అందుకే ప్రస్తుతం పెళ్లికి అమ్మాయిలు దొరక్క యువకులు ఇబ్బందులుపడుతున్నారని ఓ మహిళా రైతు నాయకురాలు తెలిపింది. ఇంతకు ముందు మహారాష్ట్రలోనూ పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరడం లేదంటూ మహారాష్ట్రలో నిరసన యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. తమిళనాడు మధురైకి చెందిన ఓ యువకుడు సైతం జీవిత భాగస్వామి కోసం పోస్టర్లు వేసిన విషయం తెలిసిందే. తాజాగా యువకులు నిర్వహిస్తున్న పాదయాత్ర సైతం వైరల్‌గా మారింది.