ఉద్యోగ నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య పెంచాలి: కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ డిమాండ్
ఇటీవల గురుకుల రిక్రూట్మెంట్ 1:2 ప్రకారం అభ్యర్థులను పిలిచారని, దీంతో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులు ఖాళీలను భర్తీ చేసి గురుకులాలను బలోపేతం చేసేందుకు

విధాత, హైదరాబాద్ : ఇటీవల గురుకుల రిక్రూట్మెంట్ 1:2 ప్రకారం అభ్యర్థులను పిలిచారని, దీంతో 4 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులు ఖాళీలను భర్తీ చేసి గురుకులాలను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకవాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. అలాగే
గ్రూప్స్ 1, 2, 3 పోస్టుల సంఖ్య పెంచాలని, గత బీఆరెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల అభ్యర్థులు నష్టపోయారని వెంటనే ఈ జీవోను ఈ ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం ఆయా సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేలా చేయవద్దని, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్నాననే నెపాన్ని నాపై నెట్టవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం పనిచేయాలని తాను కోరుతున్నానని తెలిపారు.