శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాశ్ ముదిరాజ్..!
విధాత: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్లను స్వీకరించి, 12వ తేదీన ఎన్నికల నిర్వహించనున్నారు. అయితే మండలిలో ఒకరిద్దరు మినహాయించి, మిగతా సభ్యులంతా బీఆర్ఎస్ పార్టకి సంబంధించిన వారే. దీంతో ఇతర పార్టీలు డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార పక్షం.. […]

విధాత: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 11వ తేదీన నామినేషన్లను స్వీకరించి, 12వ తేదీన ఎన్నికల నిర్వహించనున్నారు. అయితే మండలిలో ఒకరిద్దరు మినహాయించి, మిగతా సభ్యులంతా బీఆర్ఎస్ పార్టకి సంబంధించిన వారే.
దీంతో ఇతర పార్టీలు డిప్యూటీ చైర్మన్ పదవికి పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార పక్షం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును ఖరారు చేసింది. బండ ప్రకాశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రమాణస్వీకారం చేశారు.
బండ ప్రకాశ్ రాజకీయ నేపథ్యం..
బండ ప్రకాశ్ ముదిరాజ్.. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1981 నుంచి 1986 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగారు ప్రకాశ్. 1981 నుంచి 1984 వరకు వరంగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
మున్సిపల్ కౌన్సిలర్‌గా కొనసాగిన సమయంలోనే కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. 2017లో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.
టీఆర్ఎస్ పార్టీ తరపున 2018లో రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందారు. 2021, నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకాశ్ విజయం సాధించారు. అనంతరం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.