Bandi Sanjay | లోక్‌సభలో.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay | బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి కేసీఆర్ పేరు.. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న బండి సంజయ్ లోక్‌సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి, కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ […]

Bandi Sanjay |
- బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి
- కేసీఆర్ పేరు.. ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ
- 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
- కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న బండి సంజయ్
లోక్‌సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి, కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని విమర్శించారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుందని ధ్వజమెత్తారు.
భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే హీరో మోదీ
వాస్తవానికి ఈ అవిశ్వాసం ఎందుకు పెట్టారో వారికి కూడా స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడి వ్యవహారాన్నిచూసి ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు. ఒకసారి ముద్దులు, ఒకసారి ఫ్లయింట్ కిస్‌లు, కౌగిలింతలను చూస్తుంటే గజిని గుర్తుకు వస్తున్నారు. భరతమాతను హత్య చేశారని అంటున్నారు.
భరతమాత హత్య ఎప్పుడు జరగదు. ఈ భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే హీరో ప్రధాని నరేంద్ర మోదీ. వీళ్లతో ఏం కాదు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు అవిశ్వాస తీర్మాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలు సహించే స్థితిలో లేరు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ పవిత్ర దేవాలయం.. శిరసు వంచి దండాలు పెడుతున్నా..
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈ రోజు శక్తివంతమైన భారత నిర్మాణం కోసం పోరాడుతోంది. నిజంగా ఇది పవిత్రమైన దేవాలయం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన దేవాలయం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1400 మంది బలిదానాలు చేసుకున్నాక సాధించుకున్న తెలంగాణ. అలాంటి సమయంలో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పవిత్ర దేవాలయం ఇది. ఈ దేవాలయానికి శిరసు వంచి దండాలు పెడుతున్నాను.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు..
కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కిరోసిన పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు. స్వర్గీయ సుష్మాస్వరాజ్ తెలంగాణ చిన్నమ్మ.. యువత ఆత్మహత్య చేసుకోవద్దని కోరింది.
మీరు కలలుగన్న తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇదే పార్లమెంట్ వేదికగా చెప్పారు. మీరు తెలంగాణ ఇస్తారా. లేదంటే తాము ఇస్తామని కాంగ్రెస్ ను హెచ్చరించింది. ఆ తర్వాత కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చింది.
బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటోంది..
1997లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసింది. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు.. తెలంగాణలో దొరల కుటుంబం దూరింది. అవినీతి యూపీఏ ఇండియాగా ఎలా మారిందో.. అవినీతి కుటుంబ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది.
బీఆర్ఎస్ పేరు భ్రష్టాచర్ రాక్షస సమితి. కేసీఆర్ పేరు.. కాసీ చంద్రశేఖర్ రజ్వీ. తెలంగాణ ప్రజలను నాశనం చేశారు. రాత్రి తాగడం, పొద్దున పడుకోవడం బీఆర్ఎస్ నేత పని. తెలంగాణను ఆ కుటుంబం దోచుకుంటుంది. ప్రజలను దోచుకుంటున్నారు.
Speaking in the Lok Sabha. https://t.co/kO447ajd3G
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 10, 2023
కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగింది..
కేసీఆర్ కుటుంబం ఆదాయం పెరిగింది. సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు పెరిగాయి. ఆయన భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయి. రైతుల సగటు ఆదాయం.. 112836 అయితే సీఎం వ్యసాయం ఆదాయం కోటి రూపాయాలు, కొడుకు ఆదాయం 59 లక్షల 85 వేలు, కోడలు ఆదాయం 2 వేల శాతం పెరిగింది. కేసీఆర్ ఆదాయం ఎలా పెరుగుతుంది.
రాజీనామా చేస్తా..
తెలంగాణలో రైతులు నాశనం అవుతున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసరుతున్నా. 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని నేను నిరూపిస్తా. ఇవ్వలేదని తేలితే రాజీనామా చేయడానికి సిద్ధమా? అని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నాను.
కేంద్రం పైసలను కూడా దోచుకుంటోంది బీఆర్ఎస్
టాయిలెట్ల పైసలు దోచుకున్నారు. చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వలేదు. కేంద్రం పైసలను దోచుకున్నారు. ఇండ్లు ఇవ్వకుండా ప్రజలకు నిలువనీడ లేకుండా చేశారు. ఉచితంగా గ్యాస్ బీజేపీ ఇచ్చింది. గరీబ్ కల్యాన్ అన్నయోజన కింద బియ్యం, పప్పులు ఇస్తే వాటిని కూడా బీఆర్ఎస్ దొంగలు అమ్ముకున్నారు.
ఉపాధి హామీ పైసలను కూడా దోచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరించడం లేదు. మోదీ మణిపూర్ లేదని అంటున్నారు.ఇంటర్ విద్యార్థులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి వెళ్లలేదు. ఒకటో తేదీన జీతాలు అందడం లేదు. జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు.
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే..
కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిశాయి. కానీ బయట నటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలో కూడా గెలవలేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్టే.. కాబట్టి బీజేపీకి మద్దతు ఇవ్వండి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావాలని తెలంగాణ ప్రజానీకానికి విన్నవిస్తున్నాను అని బండి సంజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.