Bandi Sanjay: బందోబ‌స్తు మ‌ధ్య.. క‌రీంన‌గ‌ర్ జైలుకు బండి సంజ‌య్‌

విధాత‌: పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్ జైలుకు తరలిస్తున్నారు. జైలు వద్ద డిసిపి చంద్రమోహన్, లా అండ్ ఆర్డర్ డిసిపి శ్రీనివాస్, టౌన్ ఏసిపి తుల శ్రీనివాసరావు, అడ్మిన్ ఏసిపి ప్రతాప్, ట్రాఫిక్ ఏసిపి విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ నటేష్, ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. బస్ స్టేషన్ నుండి జైలుకు […]

Bandi Sanjay: బందోబ‌స్తు మ‌ధ్య.. క‌రీంన‌గ‌ర్ జైలుకు బండి సంజ‌య్‌

విధాత‌: పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్ జైలుకు తరలిస్తున్నారు. జైలు వద్ద డిసిపి చంద్రమోహన్, లా అండ్ ఆర్డర్ డిసిపి శ్రీనివాస్, టౌన్ ఏసిపి తుల శ్రీనివాసరావు,
అడ్మిన్ ఏసిపి ప్రతాప్, ట్రాఫిక్ ఏసిపి విజయ్ కుమార్, వన్ టౌన్ ఎస్ఐ నటేష్, ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

బస్ స్టేషన్ నుండి జైలుకు వెళ్లే మార్గం, అటవీ శాఖ కార్యాలయం నుండి జైలుకు వెళ్లే మార్గాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేసి, ఆ పరిసర ప్రాంతాలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలుకు వెళ్లే మార్గాన్ని పోలీసు అధికారులు తమ దిగ్బంధంలోకి తీసుకున్నారు.

ఎలాంటి ప్రతిఘటనకు తావు లేకుండా ఉండేందుకు మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేసేందుకు పక్కా వ్యూహంతో ఆయన ఇంటికి వెళ్లి తమ పని చక్కపెట్టుకున్న పోలీసులు ఆయనను జైలుకు తరలించే విషయంలోనూ అటు బిజెపి శ్రేణులు, ఇటు మీడియా దృష్టి మరల్చి తొలుత ఆయనను హనుమకొండ నుండి ఖమ్మం జైలుకు తరలిస్తున్నట్లు లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఆయనను కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు.

హనుమకొండ కరీంనగర్ రహదారిలో చెంజర్ల గ్రామం వద్ద పోలీసు వాహనాలు ఉన్నాయి. జైలు వద్ద సంజయ్ భార్య అపర్ణ, కుటుంబ సభ్యులు, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు బండి సంజ‌య్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.