Basara | బాసర త్రిబుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

Basara |  దీపిక ఆత్మహత్య మరవక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య క్యాంపస్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న లిఖిత త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యల పరంపర  నేల రాలుతున్న విద్యా కుసుమాలు విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీలో వరుస విద్యార్థిని ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. గత మూడు రోజుల క్రితం దీపిక అనే పీయూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో […]

  • By: krs    latest    Jun 15, 2023 3:44 AM IST
Basara | బాసర త్రిబుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

Basara |

  • దీపిక ఆత్మహత్య మరవక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య
  • క్యాంపస్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న లిఖిత
  • త్రిబుల్ ఐటీ క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యల పరంపర
  • నేల రాలుతున్న విద్యా కుసుమాలు

విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీలో వరుస విద్యార్థిని ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. గత మూడు రోజుల క్రితం దీపిక అనే పీయూసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

బాసర త్రిబుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అనే విద్యార్థిని క్యాంపస్ నాలుగవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బూర లిఖిత సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని

లిఖిత అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలికల వసతి గృహం 4 వ అంతస్తు నుండి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అది గమనించిన భద్రతా సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

భైంసా ఏరియా హాస్పిటల్ వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.