టోల్ ఫీజు వాగ్వాదం: జుట్లు ప‌ట్టుకుని కొట్టుకున్న మ‌హిళ‌లు.. వీడియో

విధాత: ఓ ఇద్ద‌రు మ‌హిళ‌లు భీక‌రంగా కొట్టుకున్నారు. బాక్సింగ్‌ను త‌ల‌పించేలా పంచుల వ‌ర్షం కురిపించుకున్నారు. జుట్లు ప‌ట్టుకుని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించుకుంటూ.. ఫైటింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర నాసిక్ స‌మీపంలోని పింపాల్‌గావ్ టోల్ బూత్ వ‌ద్ద వెలుగు చూసింది. ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు.. టోల్ ప్లాజా ఉద్యోగినిపై దాడి చేసింది. ఉద్యోగినిని దుర్భ‌ష‌లాడుతూ, చెప్పుతో కొట్టింది. చీర‌ను చింపేస్తాన‌ని బెదిరించింది. ఇక చెప్పుల‌తో కొట్టుకున్నారు. అయితే అక్క‌డున్న వారంతా ఈ ఇద్ద‌రి మ‌హిళ‌ల ఫైటింగ్‌ను త‌మ […]

  • By: krs    latest    Sep 16, 2022 1:25 PM IST
టోల్ ఫీజు వాగ్వాదం: జుట్లు ప‌ట్టుకుని కొట్టుకున్న మ‌హిళ‌లు.. వీడియో

విధాత: ఓ ఇద్ద‌రు మ‌హిళ‌లు భీక‌రంగా కొట్టుకున్నారు. బాక్సింగ్‌ను త‌ల‌పించేలా పంచుల వ‌ర్షం కురిపించుకున్నారు. జుట్లు ప‌ట్టుకుని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించుకుంటూ.. ఫైటింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర నాసిక్ స‌మీపంలోని పింపాల్‌గావ్ టోల్ బూత్ వ‌ద్ద వెలుగు చూసింది.

ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు.. టోల్ ప్లాజా ఉద్యోగినిపై దాడి చేసింది. ఉద్యోగినిని దుర్భ‌ష‌లాడుతూ, చెప్పుతో కొట్టింది. చీర‌ను చింపేస్తాన‌ని బెదిరించింది. ఇక చెప్పుల‌తో కొట్టుకున్నారు. అయితే అక్క‌డున్న వారంతా ఈ ఇద్ద‌రి మ‌హిళ‌ల ఫైటింగ్‌ను త‌మ సెల్‌ఫోన్ల‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.

అయితే వీరిద్ద‌రూ మ‌రాఠీ భాష‌లో తిట్టుకున్నారు. టోల్ ఫీజు కార‌ణంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.