Ajit Agarkar | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్
Ajit Agarkar | భారత పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో చేతన్ శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీగా ఉన్నది. చీఫ్ సెలెక్టర్ నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ సమయంలోనే అగార్కర్ దరఖాస్తు చేయగా.. ఈ సారి అగర్కార్కే చీఫ్ సెలెక్టర్ పదవి ఖాయమనే వార్తలు వచ్చాయి. […]

Ajit Agarkar |
భారత పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికయ్యాడు. చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్‌ను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి నెలలో చేతన్ శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీగా ఉన్నది.
చీఫ్ సెలెక్టర్ నియామకానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ సమయంలోనే అగార్కర్ దరఖాస్తు చేయగా.. ఈ సారి అగర్కార్కే చీఫ్ సెలెక్టర్ పదవి ఖాయమనే వార్తలు వచ్చాయి. శివ సుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శరత్‌తో కూడిన సెలక్షన్ కమిటీలో తాజాగా అగార్కర్ చేరనున్నాడు. అజిత్ అగార్కర్ భారత జట్టు తరఫున 191 వన్డేలు, 26 టెస్టులు ఆడిన అనుభవం ఉంది.
గత శనివారం క్రికెట్ అడ్వైజరీ కమిటీలోని సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే బృందం ఇంటర్వ్యూ చేసింది. అగార్కర్ భారత జట్టు తరపున మొత్తం 349 వికెట్లు కూల్చారు. 2017-19 మధ్య ముంబయి టీమ్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గానూ పని చేశారు.
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండిస్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ జట్లకు టీమ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని.. అందుకు టీమిండియాను సన్నద్ధం చేయడం అగార్కర్ లక్ష్యల్లో ఒకటి. ఒక అగర్కార్ కెరీర్ విషయానికి వస్తే 1997-2007 టీమిండియా తరఫున క్రికెట్ ఆడాడు.
భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అగార్కర్ పేరిటే ఉంది. కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లోనూ ఇన్‌స్వింగర్స్ బాగా చేయగలడనే పేరుంది. వన్డేల్లో 23 మ్యాచుల్లోనే 50 వికెట్లు తీసి సంచలన రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అతని రికార్డును శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ బ్రేక్ చేయడం విశేషం.