BCCI కొత్త సెలక్షన్ కమిటీ.. చైర్మన్‌గా చేతన్ శర్మ?
ముంబయి: కొత్త సెలక్షన్ కమిటీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శనివారం ప్రకటించింది. సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మకు మరోసారి అవకాశం ఇచ్చింది. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్, సుందర్‌దాస్‌కు సెలక్షన్ కమిటీలో చోటు కల్పించింది. సెక్షలన్ కమిటీ కోసం ప్రకటన జారీ చేయగా.. 600 దరఖాస్తులు వచ్చాయి. అడ్వైజరీ కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించింది. ఈ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి 11 మందిని అడ్వైజరీ కమిటీ ఎంపిక చేసి.. బీసీసీఐకి సిఫారసు […]

ముంబయి: కొత్త సెలక్షన్ కమిటీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శనివారం ప్రకటించింది. సీనియర్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేతన్ శర్మకు మరోసారి అవకాశం ఇచ్చింది. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్, సుందర్‌దాస్‌కు సెలక్షన్ కమిటీలో చోటు కల్పించింది.
సెక్షలన్ కమిటీ కోసం ప్రకటన జారీ చేయగా.. 600 దరఖాస్తులు వచ్చాయి. అడ్వైజరీ కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించింది. ఈ మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి 11 మందిని అడ్వైజరీ కమిటీ ఎంపిక చేసి.. బీసీసీఐకి సిఫారసు చేసింది. ఇందులో ఐదుగురికి సెలక్షన్ కమిటీలో బీసీసీఐ చోటు కల్పించింది.
ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు వైఫల్యం తర్వాత విమర్శలు రావడంతో బీసీసీఐ వేటు వేసింది. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. చేతన్ శర్మను సైతం తొలగించగా.. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్‌లో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా శర్మను కొనసాగించేం దుకు నిర్ణయించారు.