Karimnagar: అంతిమయాత్రలో డప్పు కొడుతూ గుండెపోటు.. తుదిశ్వాస
విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని ఇప్పపల్లి గ్రామానికి చెందిన దుంపెట పోశాలు అలియాస్ బాసారపు పోశాలు శుక్రవారం పోతారం గ్రామంలో ఓ అంతిమ యాత్రలో డప్పు కొడుతుండగా గుండె పోటుకు గురై మృతి చెందారు. గ్రామస్తులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామంలో అన్నారపు నరేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, ఈ నేపథ్యంలో ఇప్పపల్లికి చెందిన పోశాలు కొంతమంది మిత్రులతో కలిసి నరేష్ అంతిమ యాత్రలో […]

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని ఇప్పపల్లి గ్రామానికి చెందిన దుంపెట పోశాలు అలియాస్ బాసారపు పోశాలు శుక్రవారం పోతారం గ్రామంలో ఓ అంతిమ యాత్రలో డప్పు కొడుతుండగా గుండె పోటుకు గురై మృతి చెందారు.
గ్రామస్తులు , బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామంలో అన్నారపు నరేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, ఈ నేపథ్యంలో ఇప్పపల్లికి చెందిన పోశాలు కొంతమంది మిత్రులతో కలిసి నరేష్ అంతిమ యాత్రలో డప్పు కొడుతున్నాడు. ఇంతలోనే పోశాలు కింద పడిపోయాడు.
వెంటనే కోరుట్లకు వాహనంలో పోశాలును తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడని గ్రామస్థులు, బంధువులు తెలిపారు. పోతారం గ్రామంలో ఒకరి అంతిమ యాత్రలో డప్పు కొట్టడానికి పోశాలు వచ్చి గుండె పోటుకు గురై ప్రాణాలు విడిచాడని గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.