Uber driver | బెంగళూరులో తల్లికొడుకుపై ఉబర్ డ్రైవర్ దాడి
Uber driver సోషల్ మీడియాలో వీడియో వైరల్ నిందితుడి అరెస్టు.. స్పందించిన ఉబర్ సంస్థ Uber driver | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో తల్లి కొడుకుపై ఉబర్ డ్రైవర్ దాడి దాడిచేశాడు. ఈ దాడికి సంబంధించిన దృష్ట్యాలు సమీప సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అసలు ఏం జరిగిందంటే.. ఓ తల్లి, కొడుకు పనినిమిత్తం బయటకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఒక క్యాబ్ సమీపంలోకి రాగా ఎక్కారు. అయితే, తాము పొరపాటున వేరే […]

Uber driver
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- నిందితుడి అరెస్టు.. స్పందించిన ఉబర్ సంస్థ
Uber driver | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో తల్లి కొడుకుపై ఉబర్ డ్రైవర్ దాడి దాడిచేశాడు. ఈ దాడికి సంబంధించిన దృష్ట్యాలు సమీప సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అసలు ఏం జరిగిందంటే.. ఓ తల్లి, కొడుకు పనినిమిత్తం బయటకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేశారు.
ఒక క్యాబ్ సమీపంలోకి రాగా ఎక్కారు. అయితే, తాము పొరపాటున వేరే ఉబర్ క్యాబ్ (Uber Cab) ఎక్కామని గ్రహించారు. వెంటనే దానిని దిగారు. అయితే ఉబర్ కారు డ్రైవర్ ఆ తల్లి కొడుకుపై దాడికి దిగాడు. మహిళ అని చూడకుండా ఆమె మెడ పట్టుకొని దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె కుమారుడిపై కూడా దాడిచేశాడు.
సమీప సీసీటీవీ కెమెరాలో నమోదైన వీడియోను బాధితురాలి భర్త అజయ్ అగర్వాల్ (Aggarwal) సోషల్ మీడియాలో పెట్టారు. నిందితుడిపై పోలీసులతోపాటు ఉబర్ సంస్థకు కూడా ఫిర్యాదు చేశారు. నిందితుడిని బసవరాజ్గా గుర్తించిన పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇలాంటి వ్యక్తుల తీరు తీవ్రంగా పరిగణిస్తామని, సంస్థ నుంచి తొలగిస్తామని ఉబర్ సంస్థ ప్రతినిధి తెలిపారు.