బీజేపీ ‍‍కాంగ్రెస్‌ల మధ్య బెంజ్ కారు రచ్చ

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఓ టీవి చానల్ డిబెట్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీకి కాంగ్రెస్ నేత ఒకరు ఎంపీ టికెట్ కోసం బెంజీకారు బహుకరించారంటు చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీశాయి.

  • By: Somu    latest    Feb 20, 2024 10:56 AM IST
బీజేపీ ‍‍కాంగ్రెస్‌ల మధ్య బెంజ్ కారు రచ్చ
  • పరస్పర ఘాటు విమర్శలు..సవాళ్లు


విధాత, హైదరాబాద్ : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఓ టీవి చానల్ డిబెట్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీకి కాంగ్రెస్ నేత ఒకరు ఎంపీ టికెట్ కోసం బెంజీకారు బహుకరించారంటు చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీశాయి. ప్రభాకర్ వ్యాఖ్యలను డిబెట్‌లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిమూల శ్రీనివాస్ సహా పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ బీజేపీ దివాలా రాజకీయాలకు ప్రభాకర్ వ్యాఖ్యలు నిదర్శనం అన్నారు. అవినీతిని పెట్టుబడిగా పెట్టిన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీ ఏనాడు దేశ ప్రజలు, పేదల గురించి ఆలోచించలేదన్నారు.


దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆరెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆధారాలుంటే నిరూపించాలని లేదంటే న్యాయపర చర్యలు సిద్దంగా ఉండాలన్నారు. టీపీసీసీ కార్యదర్శి చామల ఉదయకిరణ్‌రెడ్డి కూడా ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండించారు. టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ప్రభాకర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పశ్చిమబెంగాల్ నాయకుడు దాస్ మున్షి నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తి అని, అతని సతీమణి దీపా దాస్ మున్షీ కూడా అంతే నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలతో బీజేపీ నాయకులు దిగజారుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.